క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని ప్రభావం తన మార్కెట్ మీద పెద్దగా పడలేదు. అందుకే చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. ఈ నెల 24 విడుదల కాబోతున్న ఈ ప్రేమకథకు రచన, నిర్మాణ భాగస్వామిగా బేబీ ఫేమ్ సాయి రాజేష్ వ్యవహరించగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఇవాళ ఏఏఏలో అల్లు అరవింద్ అతిధిగా ట్రైలర్ లాంచ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో కాన్సెప్ట్ చెప్పేశారు.
చెన్నైలో ఉండే ఒక అమ్మాయి (గౌరీ శ్రీప్రియ) తొలిప్రేమలో ఫెయిలవ్వడంతో తాగుబోతుగా మారుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ఛాన్స్ దొరికితే నిషా మత్తులో మునుగుతుంది. హైదరాబాద్ నుంచి దర్శకుడు కావాలని చెన్నై వచ్చిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. వీళ్లిద్దరి మధ్య మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమె వెనుక ఉన్న ఒక షాకింగ్ నిజం అతనికి తెలుస్తుంది. అదేంటనేది తెరమీద చూడాలి.
కిరణ్ బాగా హుషారుగా కనిపిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి లవ్ స్టోరీస్ లో కనిపించే హీరోయిన్ల పాత్రలకు భిన్నంగా శ్రీగౌరీ ప్రియను డ్రింకర్ గా చూపించడం వెరైటీగా ఉంది. ఈ తరహాలో ప్రయోగం ఇంతకు ముందు ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’లో చేశారు కానీ ఈ చెన్నై లవ్ స్టోరీలో మాత్రం డిఫరెంట్ గా ఉంది. చెన్నై నగరంలో జరిగే స్టోరీ కాబట్టి బ్యాక్ డ్రాప్ మొత్తం అదే ఉంది. చివరిలో కిరణ్ తో చెప్పించిన డైలాగ్ తో ఏదో ట్విస్టు ఉందనే ఫీలింగ్ కలిగించారు.
మణిశర్మ సోల్ ఫుల్ సంగీతం కంటెంట్ ని ఎలివేట్ చేయగా విజువల్స్ బాగున్నాయి. ఈ ఇద్దరినీ తప్ప వేరే ఆర్టిస్టులకు ఎక్కువగా హైలైట్ చేయలేదు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఊహించని మలుపులు తెరమీద షాక్ ఇస్తాయని పదే పదే చెబుతున్న టీమ్ నిజంగా వాటితో కనక కనెక్ట్ చేయగలిగితే ఇంకో సూపర్ హిట్ ఖాతాలో పడినగట్టే. తెలుగు స్ట్రెయిట్ సినిమాల పోటీ ఎక్కువగా లేకపోవడం చెన్నై లవ్ స్టోరీకి కలిసి వచ్చేలా ఉంది.
This post was last modified on July 18, 2026 9:14 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…