న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే. అయితే దీన్ని ప్రకటించే విషయంలో నిర్మాణ సంస్థ తొందరపడటం లేదు. ఒక మంచి కంటెంట్ తో రివీల్ చేయాలనే ఆలోచనలో ఉంది. జూలై మినహాయిస్తే చేతిలో ఉండేది కేవలం 55 రోజులే కాబట్టి ప్రమోషన్లు పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. అటు చూస్తేనేమో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టలేదు. ఇంకా బ్యాలన్స్ ఉంది.
ఇదిలా ఉండగా ప్యారడైజ్ నైజామ్ హక్కులు 37 కోట్లకు మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్వంతం చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నాని మార్కెట్ కోణంలో చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే. అంత బ్రేక్ ఈవెన్ కావాలంటే గ్రాస్ కనీసం అరవై కోట్ల దాకా వెళ్ళాలి. యునానిమస్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. ఎలాగూ బజ్ ఉంది. టీజర్, ఆయా షేర్ పాటతోనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ట్రైలర్ వచ్చాక ఇవి నెక్స్ట్ లెవెల్ అందుకుంటాయని వేరే చెప్పనక్కర్లేదు.
ప్రపంచ వ్యాప్తంగా కలిపి సుమారు నూటా పది కోట్ల దాకా డీల్ ఆశిస్తున్నట్టు వచ్చిన వార్తని ఇటీవలే నిర్మాత ఖండించిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ వ్యవహారాలు ఓపెన్ గా చెప్పేయరు కాబట్టి అందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. హిట్ 3 ది థర్డ్ కేస్ తర్వాత నానికి ఏకంగా ఏడాది పైగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్యారడైజ్ దానికి పూర్తి న్యాయం చేకూర్చాలి. ముఖ్యంగా నాని టార్గెట్ చేసుకున్న ప్యాన్ ఇండియా మార్కెట్ పెరగాలి.
అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ అంచనాలకు మించి వస్తోందట. కనెక్ట్ అయ్యిందా మాస్ కురిపించే వసూళ్లకు ఆకాశమే హద్దవుతుంది. దసరాలో జరిగిన హెచ్చుతగ్గులు ఇందులో ఏ మాత్రం లేకుండా శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే చాలా టైం ఖర్చు పెట్టేశారు. బడ్జెట్ కూడా కంట్రోల్ తప్పిపోయింది. అయినా సరే బ్లాక్ బస్టర్ అయితే అంతకంతా వెనక్కు వస్తుందనే ధీమా నిర్మాతల్లో ఉంది. కయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ ఇందులో ప్రధాన తారాగణం.
Gulte Telugu Telugu Political and Movie News Updates