పవన్‌కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయాలని డిసైడ్ అయినపుడు ఫాన్స్ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ షేప్ తీసుకుంటోన్న తీరు చూసి ఫాన్స్ నమ్మకం పెంచుకుంటున్నారు. వకీల్ సాబ్తో పోలిస్తే కచ్చితంగా ఇందులో చాలా ఆకర్షణలుంటాయని భావిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో పాత్ర చేయడానికి అంగీకరించడంతో పాటు త్రివిక్రమ్ మాటలు రాయడం, తమన్ సంగీతం చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి క్రేజ్ వచ్చేసింది. దర్శకుడు సాగర్ చంద్రకు అనుభవం లేకపోయినా కానీ మిగతా విషయాలలో ఈ చిత్రం రెడ్ హాట్ అనిపిస్తోంది.
ఇదిలావుంటే ఇందులో నటించే హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. పవన్ సరసన సాయి పల్లవి నటిస్తుందనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు ఇంకా ఆ పేరు ప్రకటించలేదు. ఆమె ఇప్పుడు తెలుగులో పలు చిత్రాలతో పాటు ఇతర భాషలలోను బిజీగా వుంది కనుక వేగంగా పూర్తి చేయాలని చూస్తోన్న ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవచ్చునని ఒక టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి కాని పక్షంలో పవన్‌కి జోడీగా ఎవరయితే బాగుంటుందని భావిస్తారో? మళ్లీ శృతిహాసన్ లేదా కాజల్‌ని మాత్రం పెట్టకండంటున్నారు ఫాన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates