ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా మంచి కమర్షియల్ సినిమా చూడబోతున్నామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రమోషన్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నాగార్జున ముఖ్యఅతిథిగా జరిగిన ఈ వేడుకలో కాస్ట్ అండ్ క్రూ మొత్తం పాల్గొంది. ఎవరి స్పీచులు విన్నా ప్రతి ఒక్కరిలో అంతులేని నమ్మకం వ్యక్తమయ్యింది.
నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ మాట్లాడుతూ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మీరు ఊహించని స్థాయిలో ఉంటాయని, ఆ ట్విస్టులు ఆశ్చర్యం కలిగిస్తాయని బల్లగుద్ది మరీ చెప్పడం అభిమానులకు కొత్త జోష్ ఇచ్చింది. నాగార్జున సైతం ఇదే కాన్ఫిడెన్స్ చూపించారు. చింటూ అంటూ వంశీ సోషల్ మీడియా పేరుని ప్రస్తావించి మరీ విశేషాలు పంచుకున్నారు. ఇక అఖిల్, భాగ్యశ్రీ బోర్సే సంగతి సరేసరి. హిట్టు కొట్టడంలో ఒక్క శాతం డౌట్ వద్డనే స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని చూపించారు.
శివాజీ, బ్రహ్మాజీ మొదలైన ఇతర ఆర్టిస్టులు కూడా ఇదే వరస. కొంత కాలంగా కాస్త డల్లుగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కి లెనిన్ జోష్ ఇవ్వాలి. ఎందుకంటే నాగార్జున గత రెండు సినిమాలు కూలి, కుబేరలో ఆయన హీరో కాదు. సోలో హీరోగా నా సామి రంగా తర్వాత దర్శనమే లేదు. తండేల్ వచ్చి ఏడాది దాటేసినా నాగచైతన్య నుంచి ఇంకో సినిమా రాలేదు. అఖిల్ గురించి తెలిసిందే. ఏజెంట్ తర్వాత చాలా కాలం మాయమైపోయాడు. ఈ లోటులన్నీ తీర్చాల్సింది లెనినే.
కాంపిటీషన్ లేదు. మొన్నొచ్చిన కొత్త రిలీజులు రెండో వారంలో నెమ్మదించిపోతాయి. సో టెన్షన్ లేదు. బాలీవుడ్ కూడా అంతంత మాత్రంగా నెట్టుకొస్తోంది. సో లెనిన్ కనక సౌండ్ చేయగలిగితే మంచి వసూళ్లు చూసుకోవచ్చు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ కు తమన్ సంగీతం ఆకర్షణ కానుంది. మహా భారతాన్ని స్ఫూర్తిగా తీసుకున్న లెనిన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. అవి కూడా ఊహించని మలుపులతో.
This post was last modified on July 6, 2026 11:03 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…