టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు. ఇటు అభిమానులు, అటు వ్యతిరేకులు.. నాగవంశీని చింటు అని సరదాగా పిలుస్తుంటారు. ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు కూడా బాగా తెలుసు. తనను చింటు పేరుతో చాలామంది ట్రోల్ చేస్తుంటారని తెలిసినా.. నాగవంశీ ఆ విషయాన్ని సీరియస్‌గా ఏమీ తీసుకోడు.
మాస్ జాతర ఈవెంట్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మాస్ రాజా రవితేజ పదే పదే నాగవంశీని.. చింటు చింటు అంటూ ఆటపట్టించడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం స్టేజ్ మీద నాగవంశీని చింటు చింటూ అంటూ సరదాగా కామెంట్ చేయడం విశేషం. నాగ్, నాగవంశీ కలిసి అక్కినేని అఖిల్‌ను హీరోగా పెట్టి లెనిన్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా నాగ్.. నాగవంశీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాకో పార్ట్‌నర్ ఉన్నాడు.. మీరంతా చింటు అన్న అని పిలుస్తారట కదా అతణ్ని.. అంటూ నాగ్ కామెంట్ చేయడంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ కామెంట్ విని నాగవంశీ కూడా నవ్వేశాడు. తర్వాత నాగ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. లెనిన్ సినిమా విషయంలో అఖిల్‌కు, తనకు ఏ ఇబ్బంది రాకుండా నాగవంశీ అన్నీ సమకూర్చి పెట్టాడని, ఈ సినిమాను పకడ్బందీగా తెరకెక్కేలా చూశాడని అన్నాడు.
చింటు అన్నకు మాస్ పల్స్ బాగా తెలుసని.. అతను ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో ఏపీ అంతటా లెనిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని, దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నాగ్ అన్నాడు. లెనిన్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ధీమాను నాగ్ వ్యక్తం చేశాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కృష్ణ రూపొందించిన లెనిన్ రాబోయే శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
This post was last modified on July 5, 2026 10:27 pm
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…