తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత.. ఇలా ఒకప్పుడు ఆయన హిట్ స్ట్రీక్ మామూలుగా సాగలేదు. కానీ కెరీర్ సెకండాఫ్‌లో ఆయన వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడ్డారు. ‘టెంపర్’ తర్వాత ఆయన ముద్ర కనిపించలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయినా అది ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం పడిపోయింది. అందుకు తగ్గట్లే తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్లు అయ్యాయి.
ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా.. ఈ సినిమా రిలీజ్ కావట్లేదు. కొన్ని నెలలుగా అసలు ఏ అప్‌డేట్ రాలేదు. పూరి గత సినిమాలకు సంబంధించిన సెటిల్మెంట్ల ప్రభావం ఈ చిత్రం మీద పడిందంటున్నారు. అలాగే దీని కంటే ముందు విజయ్ సేతుపతి ‘బత్తా’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేయడం కూడా దీనికి అడ్డంకిగా మారింది. ఐతే ‘బత్తా’ రిలీజైపోయింది. ఆశించిన స్పందన కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఫోకస్ ‘స్లమ్ డాగ్’ పైకి మళ్లింది.
త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సంకేతాలిస్తూ.. ఒక ప్రోమో వదిలాడు పూరి జగన్నాథ్. ‘ది రాజాసాబ్’లో హీరో బామ్మగా కీలక పాత్ర చేసిన ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వాహబ్ పాత్రకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఆమె బిక్షగత్తె పాత్ర చేస్తోంది. అయిన వాళ్లందరికీ దూరమై రైలుకింద పడి చచ్చిపోదామనుకున్న ఒక పెద్దావిడ.. చివరికి నిర్ణయం మార్చుకుని, కడుపు నింపుకోవడానికి ఎలా బిక్షగత్తెగా మారిందన్నది ఈ ప్రోమోలో చూపించారు.
ఈ టీజర్ చాలా హృద్యంగా సాగి బలమైన ఎమోషన్ రాబట్టింది. ముఖ్యంగా అడుక్కోవడానికి చేతులు చాచే షాట్ బాగా పేలింది. చివర్లో అమ్మ చేతులు అన్నం పెట్టాలే కానీ అడుక్కోకూడదు అంటూ పూరి వాయిస్ ఓవర్ కొసమెరుపు. స్లమ్ డాగ్‌లో ఎమోషనల్ యాంగిల్ బలంగానే ఉండబోతోందని ఈ టీజర్ సంకేతాలిచ్చింది. ఇలాంటివే మరికొన్ని ప్రోమోలు రిలీజ్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తే మంచిది.
This post was last modified on September 28, 2026 10:56 am
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…