Political News

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. అదే సమయంలో జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి కూడా ఓ ఒక్కరికీ ఉపోద్ఘాతమూ అవసరం లేదు. ఇలాంటి వీరి మధ్య వైరం తలెత్తితే…పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 2019 సార్వత్రి ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితి మనకు కనిపించింది. చింతమనేనిపై పవన్ భగ్గుమంటే… పవన్ పై చింతమనేని కూడా అదే స్థాయిలో భగ్గుమన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడెలా ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నాడు చింతమనేని వర్సెస్ పవన్ కల్యాణ్ వివాదం ఓ రేంజిలో ఫ్లేర్ అప్ అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చింతమనేని, పవన్ ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. అదే క్రమంలో టీడీపీ, జనసేన కేడర్ మధ్య కూడా విభేదాలు పొడచూపాయి. ఫలితంగా ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరిగినట్గుగా వాతావరణం మారిపోయింది. ఈ ఇద్దరి నేతల వైఖరులను ప్రస్తావిస్తూ… ఇక ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత అన్న ముచ్చటే ఉండదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తించాయి. ఆ ఎన్నికల తర్వాత కొంతకాలం పాటు అదే తరహా పరిస్థితి కొనసాగింది.

ఇక నాటి ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు… చింతమనేని ఓటమికి కూడా కారణమయ్యాయి. 2019 ఎన్నికల నాటికి వరుసగా రెండు సార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని… 2019 ఎన్నికల్లో పవన్ తో తనకు తలెత్తిన విభేదాల కారణంగానే ఓటమిపాలయ్యారు. నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ తో విభేదాల కారణంగా జనసేన కార్యకర్తలు టీడీపికి అంటే… చింతమనేనికి ఓటేయలేదు. ఫలితంగా టీడీపీకి ఉన్న ఓటింగ్ మొత్తం కూడా చింతమనేనికి పడినా… జనసేన ఓట్లు చీలిపోవడంతో ఆయన వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓట్లు గంపగుత్తగా పడటంతో చింతమనేని తిరిగి విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో ఉన్న పరిస్థితులు… 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికంతా పూర్తిగా మారిపోయాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే… తాను పోటీ చేస్తున్న దెందులూరు సీటును కూడా త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించిన చింతమనేని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దెందులూరు పేరు వింటేనే చింతమనేని గుర్తుకు వస్తారు. అలాంటి సీటును కూడా పవన్ కోసం త్యాగం చేస్తానని చింతమనేని చెప్పారంటే నిజంగా ఆశ్చర్యమే కదా. అదే సమయంలో పవన్ నుంచి కూడా చింతమనేని కీర్తిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయి. చింతమనేనిని తనకు ఇష్టమైన నేతగా పవన్ ఆ తర్వాత చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తామిద్దరం గొడవపడ్డామని… అయినా ఇప్పుడు కలిసిపోయామన్న పవన్.. గొడవ పడ్డ చోటే ఆత్మీయత చోటుచేసుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

Gulte.com కు చింతమనేని ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏ మీడియాకు అయినా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చే విషయంలో పెద్దగా ఆసక్తి చూపని చింతమనేని… గుల్టేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగానే పవన్ తో తనకు నెలకొన్న వివాదాన్ని, విభేదాలను, ప్రస్తుతం వారిద్దరి మధ్య ఉన్న కలివిడితనాన్ని చింతమనేని గుర్తు చేసుకున్నారు. నాడు తామిద్దరం పరస్పరం విమర్శలు చేసుకున్న మాట వాస్తవమేనని చింతమనేని చెప్పారు. నాటి పరిస్థితుల నేపథ్యంలో అలా జరిగిపోయిందని, తమ మధ్య విభేదాలతో తమ రెండు పార్టీల కేడర్ మధ్య కూడా యుద్ధం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదన్నారు. తాను పవన్ ను అర్థం చేసుకున్నానని, అదే సమయంలో పవన్ కూడా తనను అర్థం చేసుకున్నారని… వెరసి వైషమ్యాలు ఇట్టే కరిగిపోయాయని చింతమనేని చెప్పుకొచ్చారు.

Kumar

Recent Posts

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

7 minutes ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

16 minutes ago

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

3 hours ago

ఆమిర్ ఖాన్… ముచ్చ‌ట‌గా మూడోసారి

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వ‌య‌సులో ముచ్చ‌ట‌గా మూడోసారి పెళ్లికొడుకు అయ్యారు. కొన్నేళ్ల నుంచి ఆయ‌న…

4 hours ago

పసుపు చీరలో లెనిన్ భామ అందాల మెరుపు

అఖిల్ అక్కినేని సరసన లెనిన్ సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల విడుదలైన లెనిన్…

4 hours ago

కమల్ హాసన్ రికార్డుని కమెడియన్ దాటేశాడు

కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో లెక్కలేనన్ని గొప్ప పాత్రలు పోషించారు. వాటిలో దశావతారంది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఎవరికీ…

4 hours ago