Political News

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోగా.. ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌హా.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక వ్య‌వ‌హారం కూడా బీఆర్ ఎస్‌కు సంక‌టంగా మారుతోంది. దీంతో గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా అనే విష‌యంపై పార్టీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదురుదెబ్బలు, వలసల నడుమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో మెరుగైన స్థానాలు గెలుచుకున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వ్యూహాలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వల్ల పార్టీ ఇక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజాప్రతినిధుల వలసలతో పార్టీ ఉక్కిరిబిక్కిరి గుర‌వుతోంది. గ్రేట‌ర్‌ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (ఉదాహరణకు దానం నాగేందర్, వివేకానంద్ వంటి వారు) ప‌లాయ‌నం చిత్త‌గించారు. అలానే.. పలువురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చట్టపరమైన పోరాటం చేస్తోంది. దానం నాగేందర్ అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పులు బీఆర్ఎస్‌కు కొంత నైతిక బలాన్ని ఇచ్చినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్ర‌భావం ఏమేర‌కు ఉంటుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ తన పట్టును కోల్పోయింది. ఇది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక‌, ఖైరతాబాద్ బైపోల్ కూడా బీఆర్ ఎస్‌కు ఒక పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ స్థానంలో గెలిచి హైదరాబాద్‌లో తమకు ఇంకా పట్టు ఉందని నిరూపించుకోవాలని పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి సన్నద్ధతపై కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన, హైడ్రా, 22A నిషేధిత భూముల వివాదాలపై హైదరాబాద్ ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. వీటిలో ఏమేర‌కు స‌క్సెస్ రేట్ ఉంటుంద‌న్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో గ్రేట‌ర్‌లో బీఆర్ ఎస్ కుస్తీలు ప‌డుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

This post was last modified on September 28, 2026 6:08 am

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

2 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

3 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

3 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

3 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

5 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

9 hours ago