Political News

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ కాలేని పరిస్థితి ఏర్ప‌డుతుంది. వైసీపీ విష‌యాన్ని తీసుకుంటే.. వివిధ సామాజిక‌, వృత్తిపరమైన వర్గాలకు దూరమవుతోందనే విశ్లేషణలు వ‌స్తున్నాయి. వర్గాల పరంగా ఈ వ్యతిరేకత పెరుగుతోంద‌ని.. గ‌తంలో వైసీపీని అక్కున చేర్చుకున్న వారు కూడా ఇప్పుడు దూరం పెడుతున్నార‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలను తీసుకుంటే.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనలు రాజకీయంగా కలకలం రేపాయి. స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నిరసనల సందర్భంగా జరిగిన గొడవలు, పోలీసులు, వైసీపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలు, ఉపాధ్యాయులపై దౌర్జన్యం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇది సదరు వర్గాలను పార్టీకి మరింత దూరం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

ఇక‌, వైసీపీ అధికారంలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో, పలువురు కీలక సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లో వరుపుల సుబ్బారావు వంటి కీలక నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరడం వంటి పరిణామాలు పార్టీ క్యాడర్‌లో నిస్తేజాన్ని పెంచుతున్నాయి.

త‌ద్వారా.. సామాజిక వ‌ర్గం కూడా ప్ర‌భావితం అయింది. ఇది ఓటు బ్యాంకుపై దెబ్బప‌డేలా చేస్తోంది. గతంలో వైసీపీకి అండగా నిలిచిన కొన్ని బలమైన సామాజిక వర్గాలు (బీసీల్లోని కొన్ని ఉపకులాలు, మత్స్యకార, మైనారిటీ వర్గాలు) క్రమంగా జనసేన, తెలుగుదేశం పార్టీల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అంతర్గత వర్గపోరు మ‌రింతగా వైసీపీలో పెరుగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి నాయకులు, గ్రూపుల మధ్య తీవ్ర అసంతృప్తి, అంతర్గత వర్గపోరు పెరుగుతోంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వంటి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో క్షేత్రస్థాయి క్యాడర్ పోటీకి వెనుకడుగు వేస్తుండటం, తాడేపల్లి నుంచి వస్తున్న ఒత్తిడి పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు ఆయా వ‌ర్గాల‌ను కూడా దూరం చేసుకుంటుండంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్యంగా మారుతోంది.

This post was last modified on September 28, 2026 6:27 am

Share

Recent Posts

తాగి పాట పాడిన లెజెండ‌రీ సింగ‌ర్?

ద‌లేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగ‌ర్. తుణుక్ తుణుక్ తున్.. స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్…

48 seconds ago

యష్ ముందే చెప్పడం సరికాదేమో

నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…

40 minutes ago

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి…

1 hour ago

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

2 hours ago

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

2 hours ago

ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…

3 hours ago