పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక కాదు. అలాంటపుడు సినిమాలో భాగమైన ముఖ్య వ్యక్తులు అదుపు తప్పుతుంటారు. రివ్యూల మీద విమర్శలు చేయడం.. ప్రెస్ మీట్లలో అదుపు తప్పడం.. లాంటివి చేస్తుంటారు. అలాగే రిలీజైన రోజే బ్లాక్ బస్టర్ అని పోస్టర్లు దించి ఫేక్ సెలబ్రేషన్లు కూడా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల డ్యామేజే తప్ప.. ప్రయోజనం ఉండదని తెలిసినా, డెస్పరేషన్లో ఏదేదో చేసేస్తుంటారు ఫిలిం మేకర్స్. కానీ ది ప్యారడైజ్ సినిమా విషయంలో మాత్రం టీం భిన్నంగా వ్యవహరిస్తోంది.
రివ్యూలను, నెగెటివిటీని నాని అండ్ కో హ్యాండిల్ చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాని వేసిన తొలి సోషల్ మీడియా పోస్టులోనే అతను.. నెగెటివ్ రివ్యూలు, ట్రోల్స్ గురించి ప్రస్తావించాడు. ఎలాంటి విమర్శలు చేయకుండా వాటిని కూడా స్వీకరిస్తున్నట్లు చెప్పాడు. సినిమా పట్ల సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ కనిపిస్తున్నపుడు, ఫలితం ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి స్పోర్టివ్ స్పిరిట్‌తో పోస్టు పెట్టడం అంత తేలికైన విషయం కాదు.
ఇక శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని, అది సక్సెస్ మీట్ అని ఎక్కడా పేర్కొనలేదు. స్టేజ్ మీద ఆ రకమైన పోస్టర్లు కూడా లేవు. మీడియా ములాఖత్ అని చెప్పి ఈ ఈవెంట్ చేశారు. సినిమాలో చాలా సన్నివేశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావడం, ట్రోల్స్ రావడం, రాజకీయంగా కూడా ఈ సినిమా అగ్గి రాజేసిన నేపథ్యంలో మీడియాతో ఇంటరాక్షన్ పెడితే.. అనవసర వివాదాలు తలెత్తుతాయేమో, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని తెలివిగా ఆ కార్యక్రమాన్ని అవాయిడ్ చేశారు.
అలా అని నాని అంతటితో ఆగిపోలేదు. సినిమాలో లాజిక్స్ మిస్సయిన, ఎక్కువ విమర్శలు వచ్చిన సన్నివేశాల మీద.. ఇంకో ప్రమోషనల్ కార్యక్రమంలో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేసిన చిట్ చాట్‌లో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సీన్ల మీద ఓపెన్‌గా మాట్లాడుతూ.. ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చే, విమర్శలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది నాని, శ్రీకాంత్ జోడీ. అంతే కాక ఈ సినిమాతో ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయామని అంగీకరిస్తూ.. తర్వాత తమ చిత్రాలతో వేలెత్తి చూపలేని విధంగా చూడాలని ఇద్దరూ ఒక మాట అనుకుని ఈ చిట్‌చాట్‌ను ముగించడం విశేషం.
సినిమా థియేటర్లలో ఉండగా.. దానికి సంబంధించిన నెగెటివిటీ గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడుతూ.. తప్పులను అంగీకరిస్తూ.. స్వీయ సమీక్ష చేసుకోవడం గొప్ప విషయం. నానిలోని ఈ మంచి లక్షణాన్ని ఇండస్ట్రీలో అందరూ అలవరుచుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 28, 2026 6:14 am
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…