Movie News

సందీప్ సక్సెస్… ఐశ్వర్య ఫెయిల్..!

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. నాగ‌బంధం, రావు బ‌హ‌దూర్ లాంటి ఆస‌క్తిక‌ర చిత్రాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి. మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ చిత్రాల‌కు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చింది. వీకెండ్లో ఈ సినిమాలు బాగానే ఆడ‌తాయ‌ని భావిస్తున్నారు.
ఈ వారం తెలుగు ప్రేక్ష‌కుల కోసం థియేట‌ర్ల‌లోనే కాదు.. ఓటీటీలోనూ ఆస‌క్తిక‌ర కంటెంట్ అందుబాటులోకి వ‌చ్చింది.

సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించిన సూప‌ర్ సుబ్బును నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయ‌గా.. అమేజాన్ ప్రైమ్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ లీడ్ రోల్ చేసిన ఇస‌క‌ప‌ట్నం విడుద‌లైంది. ఐతే ఈ రెండూ పూర్తి భిన్న‌మైన టాక్ తెచ్చుకున్నాడు. సూప‌ర్ సుబ్బు చూసిన వాళ్లంద‌రూ సూప‌ర్ అంటుండ‌గా.. ఇస‌క‌ప‌ట్నం చూసిన ఆడియ‌న్స్ పెద‌వి విరుస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన తొలి తెలుగు వెబ్ సిరీస్ సూప‌ర్ సుబ్బునే కావ‌డం విశేషం. సందీప్ కిష‌న్‌కు కూడా ఇదే ఫ‌స్ట్ ఒరిజిన‌ల్. డీజే టిల్లు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ రూపొందించిన ఈ సిరీస్‌లో సందీప్.. సెక్స్ ఎడుకేష‌న్ ఆఫీస‌ర్ పాత్ర చేశాడు. సున్నితమైన కథాంశాన్ని మల్లిక్ అండ్ టీం చక్కగా డీల్ చేసింది.

వల్గారిటీకి చిటివ్వకుండా చక్కటి వినడంతో సిరీస్ ను నడిపించింది. కేవలం కామెడీతో సరిపెట్టకుండా ఎమోషన్లను కూడా బాగా పండించారు. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. సందీప్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏడు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా సాగిపోవడంతో సిరీస్ మంచి స్పందన తెచ్చుకుంటుంది.

ఐతే ఐశ్వర్య వెబ్ సిరీస్ విశాఖపట్నం మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తోంది. ఆమె ఇంతకుముందు చేసిన సుళల్ సిరీస్ కు ఇది దరిదాపుల్లో కూడా లేదు. నిఖిల్ తో స్పై లాంటి ఫ్లాప్ మూవీ తీసిన ఎడిటర్ గ్యారీ బి.హెచ్ అనాసక్తికర కథా కథనాలతో ఈ సిరీస్ ను బోరింగ్ గా నడిపించాడు. ఐశ్వర్య, సముద్రఖని పెర్ఫార్మెన్స్ కూడా ఇసకపట్నంను ఎంగేజింగ్ గా మార్చలేకపోయాయి.

This post was last modified on July 4, 2026 12:02 am

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

18 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

58 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

1 hour ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

1 hour ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago