Movie News

అందాల శ్రీదేవికి మళ్ళీ ఆఫర్లు వస్తాయా?

తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కొంతకాలం గ్యాప్ తర్వాత ఆమె చేసిన కమ్‌బ్యాక్ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆమె కీలక పాత్రల్లో నటించిన ‘సుందరాకాండ’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయనే డౌట్స్ హైలెట్ అవుతున్నాయి.

శ్రీదేవి విజయ్‌కుమార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇండస్ట్రీలో చాలా పెద్ద చరిత్రే ఉంది. ఆమె ప్రముఖ సీనియర్ నటుడు విజయ్‌కుమార్, నటి మంజుల దంపతుల కుమార్తె. సినిమా వాతావరణం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ఆమెకు నటనపై చిన్నప్పటి నుంచే మంచి పట్టుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆమెకు కెరీర్ ప్రారంభంలో బాగా ప్లస్ అయింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళు వెండితెరకు దూరంగానే ఉంది.

అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు సరిగ్గా ఆడకపోయినా, నటిగా ఆమె టాలెంట్ ని తక్కువ చేయలేం. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం శ్రీదేవి హవా అస్సలు తగ్గట్లేదు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో గ్లామరస్ పోస్టులు షేర్ చేయడం ఆమె ఎప్పుడూ ఆపలేదు. లేటెస్ట్ గా ఆమె పెట్టిన కొన్ని ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ లో ఆమె స్టైలిష్ లుక్స్ చూస్తుంటే వయసు పెరుగుతున్నా కొద్దీ అందం కూడా పెరుగుతుందా అనే రేంజ్ లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇప్పటికీ తన ఫిట్ నెస్ అండ్ చార్మ్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఆమె టెలివిజన్ లో బిజీగా ఉంటూనే, వెండితెరపై క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ కోసం స్క్రిప్టులు వింటున్నారు. శ్రీదేవికి సరైన పవర్ ఫుల్ క్యారెక్టర్ పడితే మాత్రం నటిగా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

కమ్‌బ్యాక్ మూవీస్ నిరాశ పరిచినా, తన గ్లామర్ అండ్ సోషల్ మీడియా క్రేజ్ తో ఆమె ఎప్పుడూ లైమ్ లైట్ లోనే ఉంటోంది. టాలెంట్ తో పాటు మంచి గ్లామర్ ప్రెజెన్స్ ఉన్న ఇలాంటి నటీమణులకు టాలీవుడ్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఈ అందాల శ్రీదేవి ఎలాంటి డిఫరెంట్ రోల్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

This post was last modified on July 3, 2026 10:05 pm

Page: 1 2 3 4

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

13 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

32 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

37 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago