Movie News

బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసి వస్తుందా

ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే కాకతాళీయంగా ఇక్కడో విశేషం ఉంది. 1999 జయకృష్ణ బాబాయ్ మహేష్ బాబు సోలో హీరోగా తెరకు పరిచయమైన రాజకుమారుడు సరిగ్గా ఇదే తేదీకి వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి సూపర్ స్టార్ బిరుదు అందుకోవడానికి తొలి పునాది వేసింది.

అక్కడి నుంచి మహేష్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అందులో కృష్ణగారు క్యామియో చేయడం బాగా ప్లస్ అయ్యింది. ఇక జయకృష్ణ విషయానికి వస్తే ఘట్టమనేని మూడో తరం హీరోగా గౌతమ్ కన్నా ముందు తొలి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ వయొలెంట్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా రవీనాటాండన్ కూతురు రశ తదానిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

జయకృష్ణ తండ్రి రమేష్ బాబుని హీరోగా సెటిల్ చేయడానికి కృష్ణ చాలా కష్టపడ్డారు. సామ్రాట్, ముగ్గురు కొడుకులు, బజారు రౌడీ లాంటి కమర్షియల్ హిట్స్ ఉన్నప్పటికీ ఎక్కువ కాలం కథానాయకుడిగా కొనసాగలేకపోయారు. తర్వాత వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అర్జున్ తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. తండ్రి సక్సెస్ కాలేకపోయిన చోట కొడుకుగా గెలిచి చూపించాల్సిన బాధ్యత ఘట్టమనేని జయకృష్ణ మీద ఉంది.

మరో విశేషం ఏంటంటే రాజకుమారుడు నిర్మాత అశ్వినిదత్ గారే ఇప్పుడీ శ్రీనివాస మంగాపురంకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబుని తీసుకొచ్చే ప్రయత్నాలు దాదాపు ఓకే అయ్యేలా ఉన్నాయి. అన్నయ్య కొడుకు గురించి మహేష్ ఏం చెబుతాడనే దాని మీద అంచనాల మోతాదు ఆధారపడి ఉంటుంది. వారణాసికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మహేష్ ఫ్యాన్స్ నుంచి శ్రీనివాస మంగాపురంకు మద్దతు ఉంటుందని టీమ్ భావిస్తోంది.

This post was last modified on July 3, 2026 5:54 pm

Share

Recent Posts

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

21 minutes ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

28 minutes ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

35 minutes ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

3 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

3 hours ago