Movie News

మార్కెటింగ్ విద్యలో రాజమౌళిదే సింహాసనం

ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్నా తన సినిమా కథ ఎవరికీ తెలియకూడదనే ఆత్రం రాజమౌళికి ఉండదు. టైటిల్ లీక్ అయితేనే సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టి ప్రపంచం మునిగిపోయిందన్న రేంజ్ లో హడావిడి చేసే కొందరు కొత్త తరం దర్శకులు ఈయనని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ, మర్యాదరామన్న ఇలా ఏదీ తీసుకున్నా తన స్టోరీ ఏంటో ముందే రివీల్ చేయడం జక్కన్న స్టయిల్. దానికి వారణాసి కూడా మినహాయింపుగా నిలవడం లేదు.

తాజాగా ఆయన పాల్గొన్న అనెస్సి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కొన్ని ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ వేడుకలో ఎందరో ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ పాల్గొంటున్నారు. వారణాసి గురించి చెబుతూ ఆఫ్రికా అడవుల్లో ఉండే జంతువుల క్రూరత్వం, అంటార్టికాలో ఉండే మంచు పర్వతాల చల్లదనం, రామాయణంలోని పాత్రలు, ప్రకృతి విలయాలు, ఫాంటసీతో ముంచెత్తే అద్భుత విన్యాసాలు ఇవన్నీ ఇందులో ఉంటాయని వివరించారు.

అంతే కాదు బలమైన తండ్రి కొడుకుల ఎమోషన్ అందరినీ కట్టిపడేస్తుందని హామీ ఇస్తున్నారు. అది ప్రకాష్ రాజ్ మహేష్ బాబు మధ్య ఉంటుందనే సంగతి ఆల్రెడీ లీకుల రూపంలో బయటికి వచ్చేసింది. జక్కన్న చెప్పిన వాటిలో కొన్ని టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోలో చూసినవే. వాటితో పాటు మరికొన్ని అదనపు డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నారు. తన బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఆర్ఆర్ఆర్ ఎన్ని షోలు వేస్తున్నా వాటికి వెళ్లి ప్రేక్షకులను పలకరిస్తున్నారు.

అసలే షూటింగ్ ఒత్తిడి విపరీతంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు బోలెడు ఉన్నాయి. అయినా సరే రాజమౌళి తన అవసరం ఎక్కడ ఉందనిపించినా వెంటనే అక్కడికి వెళ్ళిపోయి తన సినిమాలను మరింత విస్తృతంగా గ్లోబల్ ఆడియన్స్ కి చేరేలా చూసుకుంటున్నారు. వారణాసికి ఆస్కార్ ఖచ్చితంగా వచ్చే స్థాయిలో జక్కన్న కష్టపడుతున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. ఏప్రిల్ నెల ఎప్పుడెప్ప్పుడు వస్తుందా అని మహేష్ ఫ్యాన్సే కాదు ప్రతి మూవీ లవర్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 28, 2026 3:49 pm

Share

Recent Posts

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

1 hour ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

2 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

2 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

3 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

4 hours ago