హీరోలు పెద్ద రేంజికి వెళ్లే క్రమంలో తమ దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన వాళ్లకు కూడా ఒక పుష్ ఇచ్చి మంచి స్థాయికి తీసుకొస్తుంటారు. అల్లు అర్జున్ దగ్గర పని చేసిన బన్నీ వాసు, ఎస్కేఎన్ లాంటి వాళ్లు ఎలా ఇండస్ట్రీలో పేరున్న నిర్మాతలుగా ఎదిగారో తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ డ్రైవర్‌గా మొదలుపెట్టి.. ఇప్పుడు అక్కడ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఆధిపత్యం చలాయిస్తున్నాడు ఆంటోనీ పెరువంబూర్.
ఇలా స్టార్ హీరోల అండతో డిస్ట్రిబ్యూటర్లుగా, నిర్మాతలుగా ఎదిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే హీరోల మద్దతు ఉన్న వాళ్లే ఇలా రైజ్ అవుతుంటారు. ఐతే హీరోయిన్లలో ఇలాంటి ఇమేజ్, సపోర్ట్ సిస్టమ్ ఉన్న వాళ్లు అరుదు. గతంలో విజయశాంతి దగ్గర మేకప్ మ్యాన్‌గా పని చేసిన ఏఎం రత్నం ఎంత పెద్ద నిర్మాత అయ్యారు. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత రేంజ్ వేరు. ఆమె కూడా తన అసిస్టెంట్ ఒకరికి ఇలాంటి పుష్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్‌గా నిలబెట్టడం విశేషం.
తన పేరు.. ఆర్య. సమంత దగ్గర ఎన్నో ఏళ్లుగా అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆర్య.. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. ఈ చిత్రం అతడికి మంచి లాభాలు తెచ్చిపెట్టి డిస్ట్రిబ్యూటర్‌గా నిలబెట్టింది. దీంతో అతను ఈ సినిమా సక్సెస్ మీట్లో స్టేజ్ మీద తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సమంత తన కోసం ఎంత చేసిందో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సమంతను దేవతగా అబివర్ణిస్తూ, ఆ గుడిలో తనకు ప్రవేశం దక్కడం అదృష్టమని అన్నాడు.
ఆమె తమ బంగారం అని.. ఆ బంగారాన్ని బంగారంలా చూసుకుంటున్నందుకు రాజ్ నిడిమోరుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఒక సినిమా కోసం సమంత ఎంత కష్టపడుతుందో, రిలీజ్ టైంలో ఎంత టెన్షన్ పడుతుందో మీకు తెలియదు అంటూ ఆమె ప్యాషన్‌ను గుర్తు చేశాడు ఆర్య.
అతను కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడ్డంతో సమంతకూ కన్నీళ్లు ఆగలేదు. సక్సెస్ మీట్లో ఎందరో మాట్లాడినా ఈ స్పీచే హైలైట్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సినిమాల బిజినెస్, కలెక్షన్ల విషయంలోనే కాదు.. తమ అసిస్టెంట్లకు పుష్ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి స్థాయికి తీసుకెళ్లడంలోనూ హీరోలతో సమంత పోటీ పడుతోందని.. తన రేంజే వేరని అభిమానులు కొనియాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates