Movie News

66 ఏళ్ల వయసులో ఇదేమీ ఎనర్జీ సామి

వయసు ఒక అంకె మాత్రమే అని రుజువు చేసే హీరోలు కొందరుంటారు. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ.. సూపర్ లుక్ మెయింటైన్ చేస్తూ.. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ తమదైన ఉత్సాహం చూపిస్తూ దూసుకెళ్తుంటారు. మలయాళంలో ఇద్దరు టాప్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్‌లను చూస్తే ఒకరికి 74 ఏళ్లు, ఇంకొకరికి 66 ఏళ్లు అంటే నమ్మశక్యంగా అనిపించదు. ఇద్దరూ ఈ వయసులోనూ సూపర్బ్ లుక్‌లో కనిపిస్తుంటారు.

ఇక లాలెట్టన్ విషయానికి వస్తే.. ఈ వయసులోనూ ఇటు ఫైట్లు, అటు డ్యాన్సుల్లో తనకు తిరుగులేదని చాటుతూ ఉంటారు. స్టేజ్ మీద ఆయన చూపించే ఉత్సాహమే వేరు. తాజాగా ఒక సినీ ఈవెంట్లో 66 ఏళ్ల మోహన్ లాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన వయసులో సగం కూడా లేని అమ్మాయిలతో కలిసి ఆయన స్టేజ్‌ మీద వేసిన స్టెప్పులు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

తమ్ముడు, శంబాల లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన శ్వాసికతో పాటు సానియా అయ్యప్పన్‌లతో కలిసి మోహన్ లాల్ వీర లెవెల్లో స్టెప్పులేసి ఆశ్చర్యపరిచారు. పాత సినిమాల్లో ఆయన మాస్ డ్యాన్సుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అవి తెలుగు సోషల్ మీడియాలో కూడా సూపర్ పాపులర్. తెలుగులో వచ్చే ప్రతి పాపులర్ సాంగ్‌కీ ఆయన డ్యాన్సులను సింక్ చేసి మీమ్స్ చేస్తుంటారు మన వాళ్లు. ఐతే ఇప్పటికీ తనలో ఉత్సాహం తగ్గలేదని చాటుతూ శ్వాసిక, సానియాలతో కలిసి రొమాంటిగ్గా స్టెప్పులేసి అలరించారు లాలెట్టన్.

ఐతే ఆయన డ్యాన్సులు ఒక్క పాటకు పరిమితం కాలేదు. మూణ్నాలుగు సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి తన ఉత్సాహాన్ని చాటారు. ప్రతి పాటకూ కాస్ట్యూమ్స్ మార్చుకుని కుర్రాళ్ల తరహాలో ఆయన చూపించిన జోష్‌కు ఫిదా అవ్వాల్సిందే. వీటి కోసం ఆయనెంత రిహార్సల్స్ చేసి ఉంటారో కూడా అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగకుండా లెజెండరీ సింగర్ కె.ఎస్.చిత్రతో కలిసి ఆయన ఒక పాట కూడా పాడారు. ఇటీవలే లాలెట్టన్ ‘దృశ్యం-3’ రూపంలో భారీ విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే.

This post was last modified on June 27, 2026 1:53 pm

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago