Movie News

దిల్ రాజు కోరుకున్న మార్పులు జరగాలి

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులు ఎవరంటే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉండే పేరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా ఆయన గడించిన అపార అనుభవం అప్పుడప్పుడు జడ్జ్ మెంట్ల విషయంలో తప్పులు చేసేలా ప్రేరేపిస్తుంది. అందుకే ఫ్యామిలీ మ్యాన్, గేమ్ ఛేంజర్ లాంటి పొరపాట్లు కనిపిస్తాయి. ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల ట్రెండ్ గురించి కుండ బద్దలు కొట్టేశారు.

ఒక పెద్ద హీరో సినిమాకు మొదటి రోజు ఎంత కలెక్షన్ వచ్చిందో నిర్మాతకు మాత్రమే తెలుస్తుందని, అవతల ఇంకో స్టార్ మూవీకి పెద్ద నెంబర్ వేస్తే దాన్ని దాటిపోయామని చెప్పేందుకు తాము కూడా అదే దారిలో వెళ్లాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్ వార్స్ ప్రస్తావన కూడా ఈ సందర్భంగా తీసుకొచ్చారు. గతంలో నాగవంశీ అన్నట్టు కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు కొన్ని చేయాల్సి వస్తుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్స్ డిస్కషన్ కూడా వచ్చింది.

ఒక ప్యాన్ ఇండియా మూవీ ఎన్ని వందల కోట్లతో తీసినా దాంట్లో హీరో రెమ్యునరేషన్ నలభై శాతం దాకా ఉంటుందని, అందువల్లే బడ్జెట్ పెరిగిపోయి, టికెట్ రేట్లు పెంచుకుని, థియేటర్ ఫుట్ ఫాల్స్ తగ్గించుకునే పరిస్థితి తలెత్తిందని ఒప్పుకున్నారు. రివ్యూల గురించి మాట్లాడుతూ ఏదో కోర్ట్ ఆర్డర్ లేదా ప్రభుత్వ ఉత్తర్వు వస్తే తప్ప రిలీజ్ రోజు రివ్యూలు చేయకుండా ఎవరిని ఆపలేమని, అందుకే కాపీ రైట్స్ పేరుతో వేస్తున్న స్ట్రైక్స్ మంచిదే అని తనకు అనిపిస్తోందని ఓపెన్ గా చెప్పేశారు.

ఇలా బోలెడు ఇండస్ట్రీ విషయాలు చెప్పిన దిల్ రాజు కోరుకున్నట్టు నిజంగా మార్పు చెందే దిశగా పరిశ్రమ వెళ్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే పారితోషికాలు ఇతరత్రా ఆర్టిస్టుల భారీ ఖర్చులు కంట్రోల్ చేయలేని స్టేజికి వెళ్లిపోయాయి. ఇంకోవైపుకి ఓటిటి మార్కెట్ రోజురోజుకి పడిపోతోంది. ఈ నేపథ్యంలో అందరూ వాస్తవిక కోణంలో ఆలోచించి బడ్జెట్ నియంత్రణ మీద దృష్టి పెడితే రిలీజులు ఆలస్యం కాకుండా ఉండటంతో పాటు హీరోలు వేగంగా సినిమాలు చేస్తారు.

This post was last modified on June 27, 2026 1:40 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

25 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

55 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

7 hours ago