Movie News

మీర్జాపూర్ మూవీ… అన్నీ ఉన్నాయ్ కానీ

ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి సీజన్లో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. అమేజాన్ ప్రైమ్‌కు ఇండియాలో భారీగా సబ్‌స్క్రిప్షన్లు తెచ్చిపెట్టిన సిరీస్‌ల్లో ఇది ఒకటి. రా అండ్ రస్టిగ్గా సాగే ఈ సిరీస్‌కు బూతులు కూడా ఆకర్షణగా మారాయనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో మున్నా క్యారెక్టర్, ఆ పాత్రలో దివ్యేందు నటన.. అతడి బూతులు సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్‌గా కనిపిస్తుంటాయి.

ఈ సిరీస్‌తో వచ్చి పాపులారిటీతోనే దివ్యేందు ‘పెద్ది’, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఐతే ‘మీర్జాపూర్’ తర్వాతి రెండు సీజన్లు.. తొలి సీజన్ స్థాయిలో అయితే ఆదరణ పొందలేకపోయాయి. అయినా అవే పాత్రలతో ఇప్పుడు సినిమా కూడా రెడీ చేసేశారు. దీన్ని కూడా అమేజాన్ ప్రైమే నిర్మించడం విశేషం. దీని ట్రైటర్ తాజాగా లాంచ్ చేశారు.

‘మీర్జాపూర్’లో కీలక పాత్రలు కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిట్ (అలీ ఫజల్), మున్నా (దివ్యేందు), బీనా (రసిక దుగ్గల్), స్వీటీ (శ్రియ పిల్గావోంకర్), గోలు (శ్వేత పండిట్).. ఇలా సిరీస్‌లోని ముఖ్య పాత్రలు, వాటి నటులను సినిమాలోనూ కొనసాగించారు. కానీ తొలి సీజన్‌కు ఆకర్షణగా నిలిచిన బబ్లు పాత్రలో నటుడిని మాత్రం మార్చేశారు. విక్రాంత్ మాస్సే బదులు ఎవరో కొత్త నటుడిని పెట్టారు. అది నిరాశ కలిగించే విషయం.

‘మీర్జాపూర్’ తొలి సీజన్ చేసే సమయానికి విక్రాంత్ చిన్న స్థాయి నటుడే. కానీ తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ట్వల్త్ ఫెయిల్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగానూ నిలిచాడు. విక్రాంత్ లేకపోవడం సంగతి అలా ఉంచితే.. ‘మీర్జాపూర్’ టీవీ సిరీస్‌తో పోలిస్తే బిగ్ స్క్రీన్‌కు అవసరమైన భారీతనం.. కమర్షియల్ హంగులు మాత్రం కనిపిస్తున్నాయి.

కొత్తగా ఈ సిరీస్‌లోకి సోనాల్ చౌహాన్‌ను తీసుకొచ్చారు. ఆమె ట్రైలర్లోనే గ్లామర్ విందు చేసింది. యాక్షన్ ఘట్టాలు భారీగా ఉండబోతున్నాయని.. వయొలెన్స్‌ బాగానే దట్టించారని అర్థమవుతోంది. కానీ సెన్సార్ చిక్కులు ఉంటాయి కాబట్టి టీవీ సిరీస్‌లో మాదిరి థియేటర్లలో బూతులు వినిపించే అవకాశం కనిపించడం లేదు. ‘మీర్జాపూర్’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కిన నేపథ్యంలో సెప్టెంబరు 4న పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

This post was last modified on June 25, 2026 4:10 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

6 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago