Movie News

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో పాటు అదృష్టమూ కారణమవుతుంటుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ కోవకు చెందిన కథానాయికే. తన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తోనే ఆమె తెలుగు కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ సినిమాలో ఏకైక పాజిటివ్ అంటే భాగ్యశ్రీ అందచందాలే.

ఆ తర్వాత ఆమె తెలుగులో ఆంధ్ర కింగ్ తాలూకా, కింగ్డమ్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. మధ్యలో తమిళ చిత్రం ‘కాంత’లో కూడా అవకాశం అందుకుంది. కానీ ఈ నాలుగు చిత్రాల్లో ఒక్కటీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. అలా అని భాగ్యశ్రీ మీద ఐరెన్ లెగ్ లాంటి ముద్రలేమీ పడిపోలేదు. తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో త్వరలోనే ‘లెనిన్’ లాంటి క్రేజీ చిత్రంతో పలకరించబోతున్న భాగ్యశ్రీ.. తమిళంలో శివ కార్తికేయన్ సరసన ‘సెయాన్’ అనే సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు దక్షిణాదిన ముచ్చటగా మూడో భాషలో అడుగుపెట్టేస్తోంది భాగ్యశ్రీ. ఈసారి ఆమె ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విరామం లేకుండా చకచకా సినిమాలు చేసుకుపోయే మోహన్ లాల్.. తాజాగా విష్ణు మోహన్ అనే దర్శకుడితో సినిమా కమిటయ్యారు. అందులో భాగ్యశ్రీ కీలక పాత్రకు ఎంపికైంది.

మోహన్ లాల్‌కు, భాగ్యశ్రీకి ఏజ్ గ్యాప్ చాలా ఉంది కాబట్టి లాలెట్టన్‌కు భాగ్యశ్రీ జోడీగా నటించే అవకాశం లేదు. మరి మోహన్ లాల్ సినిమాలో భాగ్యశ్రీకి ఎలాంటి పాత్ర దక్కిందన్నది ఆసక్తికరం. గత ఏడాది రిలీజైన ‘హృదయపూర్వం’లో మాళవిక మోహనన్ తరహా పాత్రతో ఆమె మెరుస్తుందేమో చూడాలి. భాగ్యశ్రీ హిందీలోనూ యారియాన్-2, చందు ఛాంపియన్ అనే రెండు సినిమాల్లో నటించింది. చాలా తక్కువ టైంలోనే ఆమె ఇండియాలో నాలుగు ప్రధాన భాషల్లో సినిమాలు చేయడం విశేషం.

This post was last modified on June 25, 2026 5:37 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

5 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago