Movie News

లెనిన్ మేలుకునే టైం వచ్చేసింది

సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీకి వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా తమన్ సంగీతం సమకూర్చారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకున్నట్టు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమైపోతుంది. మెల్లగా పబ్లిసిటీ వేగంగా పెంచుతున్నారు కానీ అది సరిపోవడం లేదని ఫ్యాన్స్ ఫీలింగ్.

ఎందుకంటే అఖిల్ కెరీర్ కి ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటుతున్నా ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. అందుకే ఈసారి నాగార్జున నిర్మాతగా మారి స్వయంగా అన్నీ పర్యవేక్షించారు. ఇన్ సైడ్ టాక్ పాజిటివ్ గా ఉంది. ఊహించని మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్ తో అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. విడుదలకు ఇది సహజంగా అందరూ చెప్పేదే కాని థియేటర్లలో అడుగు పెట్టాక ప్రేక్షకుల తీర్పే బాక్సాఫీస్ ని నిర్ణయిస్తుంది.

లెనిన్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బిజినెస్ కు తగ్గట్టు హైప్ పెరగాలన్నా, మా ఇంటి బంగారం, పెద్ది తరహాలో ఓపెనింగ్స్ దూకుడు చూపించాలన్నా పబ్లిసిటీ కీలక పాత్ర పోషించనుంది. నాగవంశీ ఇలాంటివి బాగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి టెన్షన్ లేదనే తీరులో అక్కినేని అభిమానులున్నారు. ఒక్క సినిమా అనుభవమున్న డైరెక్టర్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం పట్ల ఇప్పటికే ఇండస్ట్రీలో ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. అందుకే ఇంత డిస్కషన్.

ఏది ఏమైనా లెనిన్ కోరుకున్న దానికన్నా ఎక్కువ సౌండ్ అయితే చేయాలి. పెద్ది, మా ఇంటి బంగారం భారీ వసూళ్లు తీసుకొచ్చాయి. వీరభద్రుడు, బ్లాస్ట్ జోన్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం తెలుగులో వర్కౌట్ చేసుకున్నాయి. సో బాగుందనే మాట బయటికి వస్తే చాలు కనకవర్షం కురవడం ఖాయం. రామ్ చరణ్ కు రంగస్థలం, నాగచైతన్యకు తండేల్ లాగా ఈ లెనిన్ అఖిల్ కు తిరుగు లేని జ్ఞాపకాన్ని ఇస్తుందని మూవీ లవర్స్ నమ్ముతున్నారు. చూడాలి మరి లెనిన్ ఎలా దాన్ని అందుకోబోతున్నాడో.

This post was last modified on June 25, 2026 9:18 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

7 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

7 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

7 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

9 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago