ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల బాధ్యతలు పూర్తి చేశాక మళ్ళీ వివాహం చేసుకోవాలనుకునే పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాని ఈమేదో ఏజ్ బార్ బ్యాచ్ కాదు. వయసు 35 లోపే. కాకపోతే హీరోయిన్ గా ఇప్పుడు కష్టం కాబట్టి సపోర్టింగ్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతోంది. వంద దేవుళ్ళు తల్లి క్యారెక్టర్ లో నటించడం కన్నా జీవించిందని చెప్పాలి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే స్వసిక నితిన్ ‘తమ్ముడు’లో అడవిలో పొగాకు తాగే వాన్ డ్రైవర్ గుత్తిగా చేసింది. నెగటివ్ షేడ్ కూడా ఉంటుంది. వంద దేవుళ్ళులో ఉన్నది ఆమెనంటే ఆశ్చర్యపోవడం ఖాయం. వీరభద్రుడులో ఆర్జె బాలాజీ అసిస్టెంట్ గా కనిపించేది కూడా ఈమెనే. అందం, టాలెంట్ రెండూ ఉన్నా సరిగ్గా వాడుకోవడం తెలియని దర్శకుల వల్ల కెరీర్ నెమ్మదిగా వెళ్తోంది. వంద దేవుళ్ళు కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు కానీ కంటెంట్ పరంగా పాసయ్యింది.
ఇంకో ట్విస్టు ఉంది. స్వసిక 2012లో ‘ఎటు చూసిన నువ్వే’ అనే చిన్నా సినిమాలో హీరోయిన్ గా చేసింది. అదసలు వచ్చిన సంగతే ఎవరికీ గుర్తు లేనంతగా ఫ్లాప్ అయ్యింది. తర్వాత బ్రేక్ తీసుకుని తమిళ, మలయాళంకు పరిమితమయ్యింది. స్వంత రాష్ట్రం కేరళనే. కాకపోతే పెద్ద బ్రేక్ ఇచ్చే డైరెక్టర్ దొరక్క సంవత్సరాలు గడిచిపోయాయి. టీవీ ఆర్టిస్టుగా యాంకర్ బోలెడు షోలు, గేమ్స్, సీరియల్స్ చేసిన స్వసికకు బుల్లితెర మీద పెద్ద ఫాలోయింగ్ ఉంది కానీ సిల్వర్ స్క్రీన్ మీద పనవ్వలేదు.
ఇలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం టాలీవుడ్ లో ఉన్న సపోర్టింగ్ ఆర్టిస్టుల కొరత ఇలాంటి వాళ్ళ ద్వారా కొంతైనా తీర్చుకునే ఉద్దేశంతో. ఈమె అసలు పూజ విజయ్. తెర కోసం పేరు మార్చుకుంది. వంద దేవుళ్ళు తమిళంలో ఓ మోస్తరుగా ఆడుతోంది కానీ తెలుగులో మా ఇంటి బంగారం ఎఫెక్ట్ వల్ల ఆదరణకు నోచుకోవడం లేదు. చూసిన వాళ్ళు నిరాశ పడటం లేదు కానీ పబ్లిక్ టాక్ పూర్తిగా బయటికి వెళ్ళకపోవడంతో వసూలు ఏమంత గొప్పగా లేవు.
Gulte Telugu Telugu Political and Movie News Updates