Movie News

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు. కాకపోతే మునుపటి స్పీడ్ తగ్గించారు అంతే. ఇటీవలి కాలంలో బిజెపి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు సంధిస్తున్న ప్రకాష్ రాజ్ పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ధర్మస్థల కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ బెంగళూరు ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోవడం ఇష్యూ అయ్యింది. ఇలా నిత్యం వార్తల్లోన ఉండే ప్రకాష్ రాజ్ కు సంబంధించి ఒక విశేషం ఉంది.

ఆయన ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు చాలా వాటిలో భాగమయ్యారు. ప్రభాస్ ‘స్పిరిట్’లో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు. అందుకే వాయిస్ టీజర్ లో ప్రకాష్ రాజ్ గొంతే వినిపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్, మహేష్ బాబు వారణాసి, దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మలో ఈయన కోసమే ఆయా దర్శకులు డిజైన్ చేసిన రోల్స్ ఉన్నాయి. ఒకవేళ ‘ఓజి 2’ కనక కార్యరూపం దాలిస్తే ప్రకాష్ రాజ్ లేకుండా సీక్వెల్ నడిపించడం కష్టం.

సినిమాలకు, రాజకీయాలకు పవన్ ముడిపెట్టరు కాబట్టి ఓజి 2 నిజంగా సెట్స్ కి వెళ్తే వకీల్ సాబ్ తరహాలో ఇద్దరూ మళ్ళీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా డైరెక్టర్లు చాలా మంది ప్రకాష్ రాజ్ కు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఉంది. కొన్నింటికి తను తప్ప ఇంకెవరూ సూట్ కారు అనిపిస్తుంది. నేటివిటీ సమస్య ఉండదు. డబ్బింగ్ ప్రాబ్లమ్ అసలే రాదు. భాషతో సంబంధం లేకుండా అందరు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

అయితే ఇంత బాగా కెరీర్ ఉన్నప్పుడు పొలిటికల్ గా ఎందుకు వివాదం చేసుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానం ప్రకాష్ రాజే చెప్పాలి. ఏ పార్టీలో లేకుండా, ఎవరికి మద్దతో చెప్పకుండా పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ముఖ్యమంత్రిని కాకుండా కేవలం డిప్యూటీ సీఎంని మాత్రమే విమర్శిస్తాను అంటే అది జనంలోకి ఇంకోలా వెళ్ళిపోతుంది. అయినా తన ధోరణి మార్చుకునే ఉద్దేశంలో మాత్రం కనిపించడం లేదు. ఏదైతేనేం వివాదాలు ఎలా ఉన్నా ఆఫర్లకు మాత్రం లోటు లేదు.

This post was last modified on June 21, 2026 2:02 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

42 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

50 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago