Movie News

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు అతనే. రాజమౌళి భారీ బడ్జెట్లో, మూణ్నాలుగేళ్లకు ఒక సినిమా తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. అనిల్.. ఏడాదికో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వసూళ్ల మోత మోగిస్తున్నాడు. తన సినిమాలు సెట్స్ మీదికి వెళ్లక ముందు నుంచే అనిల్ వాటిని ప్రమోట్ చేసే తీరు కూడా భలేగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని కూడా అలాగే వార్తల్లో నిలబెడుతున్నాడు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ పేరుతో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్‌ను వైజాగ్ బీచ్‌లో పూడ్చి పెట్టి జంధ్యాల సినిమాలో కామెడీ సీన్ గుర్తు చేసిన అనిల్.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్న నేపథ్యంలో తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు.

తాను ప్రమోషన్లు భలేగా చేస్తానంటూ అభిమానులు తనకిచ్చిన కత్తిని పట్టుకుని అనిల్ వీరావేశంతో వస్తే.. వెంకీ ఆ కత్తినే ఉపయోగించి అనిల్ వేలు కోసి (ఎడిట్ మాత్రమే) అతడికి రక్త తిలకం దిద్దడం.. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా అందుకుని అదే పని చేయడం.. ఇలా భలే ఫన్నీగా సాగింది ఈ వీడియో. అంతా అయ్యాక ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో రివీల్ చేశారు.

రాయలసీమ నేపథ్యంలో అనిల్ తన కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. అందుకే ఇలా కత్తి.. వీర తిలకం అంటూ ఫన్నీ వీడియో చూసి రాయలసీమ ప్రాంతాన్ని గుర్తు చేసింది టీం. కాకపోతే అనిల్ సినిమాల్లో వయొలెన్స్‌కు పెద్దగా స్కోప్ ఉండదు.

వయొలెన్స్ చూపించినా.. అది కామెడీ కోణంలోనే ఉంటుంది. అనిల్ కూడా రాయలసీమ నేపథ్యం అయినా సరే.. తమది ఫక్తు ఫ్యామిలీ సినిమానే అని సంకేతాలు ఇచ్చాడు. ఐతే ఇప్పటిదాకా రాయలసీమ నేపథ్యంలో సినిమా తీయని అనిల్.. అక్కడి భాష, యాస, పరిస్థితులను తన కామెడీ-ఫ్యామిలీ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరం.

This post was last modified on June 21, 2026 4:08 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

47 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

55 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago