ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు అయిన జైకృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అతను హీరోగా అజయ్ భూపతి రూపొందించిన ‘శ్రీనివాస మంగాపురం’ గురువారం విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు. అసలే సినిమాకు బజ్ తక్కువగా ఉండగా.. బ్యాడ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్లో కూడా సినిమా నిలబడలేకపోతోంది.
ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ యువ కథానాయకుడు హీరోగా పరిచయం అవుతుంటే.. ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆ కుర్రాడు ఎలా చేశాడా అని సినిమా చూస్తారు. కానీ జైకృష్ణ విషయంలో అలా జరగలేదు. అందుక్కారణం ఈ సినిమా ప్రోమోలు అంత ఆసక్తికరంగా లేకపోవడం. జైకృష్ణ తొలి సినిమాకు పబ్లిసిటీ కూడా అనుకున్నంతగా లేదు. ముఖ్యంగా మహేష్ బాబు ఈ కుర్రాడిని పెద్దగా ప్రమోట్ చేయకపోవడం కూడా బజ్ రాకపోవడానికి కారణం కావచ్చు.
ఐతే ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చూస్తే.. జైకృష్ణ పెర్ఫామెన్స్ నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. కుర్రాడిలో ఈజ్ ఉంది. ఒడ్డూ పొడవూ బాగున్నాడు. లుక్స్ సూపర్ అనలేం కానీ.. బ్యాడ్ ఏమీ కాదు. ఫైట్లు, డ్యాన్సుల్లో ఆకట్టుకున్నాడు. పెర్ఫామెన్స్ ఓకే అనిపించాడు. కొన్ని చోట్ల హావభావాలు మెరుగుపడాల్సి ఉన్నా.. ఓవరాల్‌గా ప్రామిసింగ్ టాలెంటే అనిపించాడు.
తొలి సినిమా నిరాశపరిచినా.. జైకృష్ణ ఇంకో సినిమాతో పుంజుకోవడానికి అవకాశముంది. కానీ ఈ సినిమా తన కంటే దర్శకుడు అజయ్ భూపతికి బాగా డ్యామేజ్ చేసింది. ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరోను పరిచయం చేస్తూ ఇలాంటి సినిమా తీశాడేంటి అంటూ అందరూ అజయ్‌ని తప్పుబడుతున్నారు.
నిజానికి ఇలా ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తుంటే.. మాస్ ఇమేజ్ కోసం రకరకాల షరతులు పెడతారు. ఇంట్రో ఇలా ఉండాలి.. బిల్డప్ ఇవ్వాలి.. ఎలివేషన్లు పడాలి అని. కానీ జైకృష్ణ విషయంలో అలాంటి షరతుల్లేకుండా.. దర్శకుడికి సరెండర్ అయ్యేలా స్వేచ్ఛ ఇచ్చారు. అజయ్ కోరుకున్నట్లుగా నటించడానికి హీరో సిద్ధపడ్డాడు.
కానీ ఈ అవకాశాన్ని అజయ్ ఉపయోగించుకోలేదు. తన స్టయిల్లో డిఫరెంట్ మూవీ తీయడానికి అతడికి మంచి స్కోప్ ఉంది. కానీ అతను మాత్రం ఆ పని చేయకుండా చాలా సాధారణమైన సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. కొత్త హీరోకు మంచి హిట్ ఇస్తే.. అజయ్ భూపతికి మంచి పేరొచ్చేది. కానీ అతను తీవ్రంగా నిరాశపరిచాడు. ‘శ్రీనివాస మంగాపురం’తో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
This post was last modified on August 1, 2026 4:18 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…