అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఇవాళ అనౌన్స్ మెంట్ ఉంటుందని నిన్నే తెలిసినప్పటికీ డేట్ మీద అనుమానాలు అలాగే ఉండిపోయాయి. వాటికి చెక్ పెడుతూ కెవిఎన్ ప్రొడక్షన్స్ యష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో సమాంతరంగా రూపొందిన టాక్సిక్ భారీ బడ్జెట్ తో రూపొందింది.
ఇక్కడ చిక్కు ఏమిటంటే ఎలాగూ ప్యారడైజ్ తప్పుకుంది కాబట్టి తమకు ఇబ్బంది లేదని భావించిన ఇతర సినిమాలకు సమస్య వచ్చినట్టే. ఎందుకంటే అదే రోజు శర్వానంద్ భోగి ఎప్పుడో లాక్ చేశారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో నేరుగా టాక్సిక్ తో క్లాష్ అంటే బయట రాష్ట్రాల్లో స్క్రీన్ షేరింగ్ ఇబ్బందవుతుంది. రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 వస్తుంది. అంటే కేవలం అయిదు రోజుల ముందు. మైత్రి ఏపీ తెలంగాణతో పాటు దక్షిణాది బిజినెస్ మీద భారీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పుడు టాక్సిక్ వస్తుంది కాబట్టి వీళ్ళేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో యష్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. చాలా ఇంటెన్స్ రివెంజ్ డ్రామా ఉంటుందని, యాక్షన్ ఎపిసోడ్లకు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయమని టీమ్ నమ్మకంగా చెబుతోంది. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి లాంటి క్రేజీ లేడీ క్యాస్టింగ్ ఇందులో భాగం కావడం విశేషం.
త్వరలోనే ప్రమోషన్లు వేగవంతం చేయబోతున్నారు. యష్ ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో సవాళ్ళను తీసుకున్నాడు. ఖర్చు చేయి దాటిపోతున్నా సరే ఏ మాత్రం నెరవకుండా కెవిఎన్ సంస్థ వందల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. తెలుగులో దిల్ రాజు ద్వారా టాక్సిక్ పంపిణి కాబోతోంది. దీని ఫలితాన్ని బట్టే నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని మీద యష్ నిర్ణయం తీసుకోబోతున్నాడు. . యష్ నటించిన మరో ప్యాన్ ఇండియా మూవీ రామాయణ నవంబర్ లో వస్తుంది.
This post was last modified on June 21, 2026 1:17 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…