Movie News

న‌వ్వుతూనే టాలీవుడ్‌పై పంచ్ వేసిన విల‌న్

తెలుగులో ద‌స‌రా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో. తెర మీద ఎక్కువ‌గా అదో టైపు పాత్ర‌లు చేసే అత‌ను.. నిజ జీవితంలో కూడా కొంచెం టిపిక‌ల్‌గానే ప్ర‌వ‌ర్తిస్తుంటాడు, త‌న మాట తీరు కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. అత‌డి చుట్టూ అనేక వివాదాలు కూడా ముసురుకున్నాయి. త‌న‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఐతే ఇప్పుడత‌ను టాలీవుడ్ మీద వేసిన పంచ్ మాత్రం అంద‌రినీ ఆలోచింప‌జేసేదే. తెలుగు సినిమాల మేకింగ్‌లో విప‌రీతమైన‌ ఆల‌స్యం జ‌ర‌గ‌డం గురించి అత‌ను వేసిన సెటైర్ చ‌ర్చనీయాంశంగా మారింది. శ్రీ విష్ణు హీరోగా తెర‌కెక్కిన కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమాలో షైన్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ సినిమా నుంచి ఒరియా పిల్లా అంటూ సాగే పాట‌ను టీం తాజాగా లాంచ్ చేసింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఈవెంట్లో షైన్ పాల్గొన్నాడు.

అత‌ను మాట్లాడుతూ.. కామ్రేడ్ క‌ళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు మొద‌లైందో గుర్తు చేసుకున్నాడు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సినిమా సెట్స్ మీదికి వెళ్లింద‌ని.. ఇప్పుడు జూన్ చివ‌రికి వ‌చ్చామ‌ని.. అంటే ఏడాదిన్న‌ర పాటు ఈ సినిమా మేకింగ్ జ‌రిగింద‌ని చెబుతూ.. ఇక్క‌డి జ‌నాలు ఇంత‌కాలం పాటు ఎలా సినిమా తీస్తారో త‌న‌కు అర్థం కాద‌ని న‌వ్వుతూ వ్యాఖ్యానించాడు షైన్. తాను ఈ ఏడాదిన్న‌ర‌లో మ‌ల‌యాళంలో 15 సినిమాల దాకా చేశాన‌ని.. త‌న దృష్టిలో అది కూడా చిన్న నంబ‌రే అని అత‌న‌న్నాడు.

షైన్ ఇలా మాట్లాడుతున్న‌పుడు కామ్రేడ్ క‌ళ్యాణ్ టీం స‌భ్యులంతా గ‌ట్టిగా న‌వ్వారు. నిజానికి ఇది జోక్‌లా అనిపించినా.. మన ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న తీవ్ర స‌మ‌స్య‌ను షైన్ ఎత్తి చూపాడ‌ని చెప్పొచ్చు. మ‌ల‌యాళంలో కంటెంట్ ప‌రంగా ఎంతో క్వాలిటీతో తీసే సినిమాలు నెలా రెండు నెల‌ల్లో పూర్త‌యిపోతాయి. కానీ మ‌న ద‌గ్గ‌ర విష‌యం అంతంత‌మాత్రంగా ఉన్న సినిమాల‌నే ఏళ్ల త‌ర‌బ‌డి తీస్తుటారు. దీని వ‌ల్ల వ‌ర్కింగ్ డేస్, బ‌డ్జెట్ విప‌రీతంగా పెరిగి నిర్మాత‌లు దారుణంగా దెబ్బ తింటున్నారు. ఇప్ప‌టికైనా వ‌ర్కింగ్ డేస్ త‌గ్గించి, సినిమాలు వేగంగా చేయ‌డం మీద దృష్టిసారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది స్ప‌ష్టం.

This post was last modified on June 20, 2026 7:46 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

20 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago