Movie News

ఎవరయ్యా ఈ సమంత ఫ్రెండు…

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాక్ మరీ గొప్పగా ఏమీ లేదు. యావరేజ్, ఎబోవ్ యావరేజ్ రివ్యూలే వచ్చాయి. టాక్ కూడా అంతే. కానీ ఎవ్వరూ ఇది బోరింగ్ అని కానీ.. చూడతగని చిత్రం అని కానీ అనట్లేదు. అదే సినిమాకు ప్లస్ అవుతోంది.

సమంత పెర్ఫామెన్స్ సూపర్ అని అందరూ అంటుండడం.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ రావడంతో జనం థియేటర్లకు కదులుతున్నారు. సినిమాకు ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. దీనికి తోడు టాక్ కూడా కలిసొచ్చి సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఒక మిడ్ రేంజ్ స్టార్ హీరో రేంజిలో ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతుండడం విశేషం. పెర్ఫామెన్స్ పరంగా ఈ చిత్రంలో సమంతకే అగ్రతాంబూలం దక్కుతుందనడంలో సందేహం లేదు.

కానీ ఇప్పటిదాకా ప్రేక్షకులకు పరిచయమే లేని ఒక కొత్త నటి సహాయ పాత్రలో ఇచ్చిన పెర్ఫామెన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ నటి పేరు.. మంజూష ముక్కవిల్లి. ఇందులో ఆమె సమంత స్నేహితురాలి పాత్ర చేసింది. ఒక ప్లలెటూరి ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగు పెట్టిన తన స్నేహితురాలికి వంటలో ఓనమాలు కూడా తెలియని పరిస్థితుల్లో తన కోసం భర్తను విడిచిపెట్టి తన దగ్గరికి వెళ్లే పాత్ర ఇది.

లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు వండుకొచ్చి ఫ్రెండుకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే క్యారెక్టర్లో మంజుష భలే పెర్ఫామ్ చేసింది. ఒకవైపు అమాయకంగా కనిపిస్తూ.. ఇంకోవైపు గడుసుతనాన్ని కూడా ప్రదర్శించే సన్నివేశాల్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటోంది.

చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయిన వైనం.. అనుభవం ఉన్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించేదే. ఒక కొత్త నటి నుంచి ఇలాంటి పెర్ఫామెన్స్ అరుదు. మంజూష రీల్స్ ద్వారా దర్శకురాలు నందిని రెడ్డి దృష్టిలో పడి ఈ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న మంజూషకు మున్ముందు మంచి ఛాన్సులే రావచ్చు.

This post was last modified on June 20, 2026 12:55 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

22 minutes ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

25 minutes ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

3 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

3 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

4 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

6 hours ago