కొత్త ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. జూన్ లో ఇంకొక్క పది రోజులు మాత్రమే మిగిలున్నాయి. 2027 సంక్రాంతికి ఏమేం సినిమాలు రావాలో ఇప్పుడే డిసైడ్ చేసుకుంటున్నాయి. కొందరు ఏకంగా డేట్లు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. పది శాతం షూటింగ్ కానివి వాటిలో ఉండటం గమనార్హం. అలాంటిది చిత్రీకరణ దాదాపు పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఒక ప్యాన్ ఇండియా మూవీకి ఇంకా రిలీజ్ డేట్ అయోమయం తొలగకపోవడం పెద్ద విచిత్రం.
నిఖిల్ సిద్దార్థ్ స్వయంభు ఎప్పుడు థియేటర్లకు వస్తుందో ఇప్పటికీ తేలలేదు. దీనికన్నా ఆలస్యంగా మొదలైనవి, సమాంతరంగా చేసుకున్నవి వరసగా దిగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డ నాగబంధం జూలై 3 వస్తోంది. కొన్ని నెలల క్రితం దీని విషయంలోనే నిఖిల్ కాస్త ట్రిగ్గర్ అయిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. దాని గొడవ ఎందుకనుకుంటే అసలు స్వయంభు ఎప్పుడు రావాలనుకుంటుందో క్లారిటీ మిస్ అవుతోంది.
ఫిబ్రవరి నుంచి అదిగో ఇదిగో అంటూ స్వయంభు టీమ్ కాలయాపన చేస్తూనే ఉంది. ఒక భారీ సినిమాకు హైప్ సజీవంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు జనం నోళ్ళలో నానుతూ ఉండాలి. లేదంటే ఏమవుతుందో కళ్ళముందు చాలా ఉదాహరణలున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్లు తెచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నప్పటికీ ఓవర్సీస్, నార్త్ లో ఫెయిల్యూర్ గా మిగిలింది. కారణం సింపుల్. మొదటి పాటకు ఏర్పడ్డ బజ్ ట్రైలర్ నాటికి బాగా తగ్గిపోవడం.
విశ్వంభర ఫేస్ చేస్తున్న సమస్య చూసి కూడా స్వయంభు ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. నిఖిల్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. విపరీతంగా కష్టపడ్డాడు. నిర్మాత మంచి నీళ్లలా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టీజర్ వచ్చి నెలలు దాటిపోయింది. తర్వాత లిరికల్ సాంగ్ వదిలారు. తర్వాత ఏ అప్డేట్ లేదు. జూన్ 1 మేకింగ్ వీడియో వదిలారు కానీ దాంట్లో విడుదల తేదీ లేదు. ఓటిటి డీలా ఇంకేదైనా కారణమా పక్కనపెడితే స్వయంభు ముందు చేయాల్సిన పని కనెక్టివిటీ తగ్గకుండా చూసుకోవడమే.
This post was last modified on June 20, 2026 11:33 am
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…