టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ సర్ప్రైజ్ కాంబినేషన్లో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కొత్త సినిమాకు గురువారమే శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా ముహూర్త వేడుకను నిర్వహించారు. లెజెండరీ డైరెక్టర్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా.. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు.
ఈ వేడుకకు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరూ వెంకీ, కళ్యాణ్ రామ్‌లకు జోడీగా నటించబోతున్నారు. ఐతే కళ్యాణ్ రామ్ సరసన కృతి నటిస్తున్న విషయాన్ని అనిల్ ఇంతకుముందే ఒక వేదికలో అనౌన్స్ చేశాడు. కీర్తి విషయంలోనే కొంచెం సస్పెన్స్ నడిచింది. కానీ ఈ రోజు ఆ సస్పెన్సుకు తెరపడింది. వెంకీ సరసన కీర్తి అని ముందే వార్తలు వచ్చినప్పటికీ.. కొన్ని రోజుల ముందు ఈ మలయాళ భామ ప్రెగ్నెంట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది.
రెండేళ్ల ముందు ఆంటోనీని పెళ్లాడిన ఆమె, ఇప్పుడు తల్లి కానున్నట్లు జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో కీర్తి కొత్త సినిమాలేవీ ఒప్పుకోదేమో అనుకున్నారు. ఈ వార్తే నిజమైతే వెంకీ, అనిల్ సినిమాను ఓకే చేసినా తప్పుకునేది. కానీ ఆమె ఈ చిత్రంలో నటిస్తోందంటే ప్రెగ్నెన్సీ వార్తలన్నీ అబద్ధమేనన్న మాట.
తెలుగులో మధ్యలో కీర్తికి కొంచెం గ్యాప్ వచ్చింది కానీ.. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతోంది. ఆల్రెడీ ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ లాంటి క్రేజీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పక్కా హిట్ అని అంచనా ఉన్న అనిల్ సినిమాలో నటిస్తుండడంతో కీర్తి మళ్లీ కెరీర్ పీక్స్‌ను అందుకునేలా కనిపిస్తోంది.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కృతి శెట్టికి కూడా ఈ చిత్రం ఎంతో కీలకం. గత రెండు సంక్రాంతి పండుగలకు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న అనిల్.. వరుసగా మూడో ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ ప్రచారంలోకి చవ్చింది.
This post was last modified on June 19, 2026 6:02 am
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…