Movie News

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం కూడా. చేతిలో ఆరేడు సినిమాలతో తను మాములు బిజీగా లేడు. ఇప్పుడు జివి ప్రకాష్ కుమార్ సైతం క్రేజీ ప్రోజెక్టులను తన ఖాతాలో వేసుకుంటూ జెండా పాతే ప్రయత్నం చేస్తున్నాడు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’కి జివి మ్యూజిక్ చాలా కీలకం కానుందని దర్శకుడు అజయ్ భూపతి పలు సందర్భాల్లో నొక్కి మరీ చెబుతున్నారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా భాగస్వామ్యంలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’ మీద షూటింగ్ టైం నుంచే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. గత రెండు చిత్రాలు భీమ్స్ సిసిరోలియోకి ఇచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకున్న రావిపూడి ఈసారి తీస్తున్న మల్టీస్టారర్ ” వెంకీ అనిల్ 5 ” కి జివిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడితో ఆగకుండా ఆల్రెడీ ప్రమోషన్లలో వాడుకుంటున్న వైనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ మీద నాగ వంశీ నిర్మిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. దీన్ని జివి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చివరి దశలో ఉంది. సుహాస్ కోలీవుడ్ కు పరిచయమవుతున్న ‘మందాడి’ మీద బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొంది. జానర్స్ పరంగా ఒకదానితో మరొకటి సంబంధం లేని సినిమాలు చేస్తున్న జివి ప్రకాష్ కు ఇవన్నీ సవాల్ విసిరేవే.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవితేజ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్న ‘ఇరుముడి’ ఇంకో ఎత్తు. గతంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపంలో జివి ఒక ఫ్లాప్ ఇచ్చాడు. కంటెంట్ బాలేకపోవడం పక్కనపెడితే మ్యూజిక్ కు కూడా పేరు రాలేదు. ఈసారి ఆ బాకీని ఇరుముడితో తీర్చాలని మాస్ మహారాజా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంత టైట్ షెడ్యూల్స్ లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే జివి మీద ఉంది. అది ఏ మేరకు నెరవేరుస్తారో కాలమే నిర్ణయిస్తున్నారు.

This post was last modified on June 19, 2026 9:27 am

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

60 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

4 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

5 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

6 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

7 hours ago