టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు తెగ నచ్చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత గ్లామరస్ గా కనిపిస్తుందో, సాంప్రదాయ దుస్తుల్లో అంతకంటే రెట్టింపు అందంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె ఇచ్చే పోజులు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
ఇక ఇప్పుడు ఎరుపు రంగు శారీలో మృణాల్ మెరిసిపోయిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. అందమైన డిజైన్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్ గా పెట్టుకున్న గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ ఆమె లుక్ ను మరింత ఎలివేట్ చేశాయి. లైట్ మేకప్, లూజ్ హెయిర్ తో చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ, ఆమె కళ్లలోని ఎక్స్ ప్రెషన్స్ ఫోటోలకు ఒక ప్రత్యేకమైన లుక్ ని తీసుకువచ్చాయి. పర్ఫెక్ట్ గా శారీని క్యారీ చేయడంలో ఆమె స్టైలే వేరని ఈ పిక్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలంటే సక్సెస్ లు చాలా ముఖ్యం. ఒక్క ఫ్లాప్ వస్తేనే ఆఫర్స్ తగ్గిపోయే ఈ గ్లామర్ ఫీల్డ్ లో మృణాల్ థాకూర్ రూట్ మాత్రం చాలా డిఫరెంట్ గా సాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె క్రేజ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గడం లేదు. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో నిలబడకపోతే ఆ ఎఫెక్ట్ హీరోయిన్ కెరీర్ మీద పడుతుంది.
కానీ మృణాల్ విషయంలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, తిరుగులేని గ్లామర్ ఆ నెగిటివిటీని దరిచేరనివ్వడం లేదు. కథలో ఆమె క్యారెక్టర్ కు ఉన్న ఇంపార్టెన్స్, స్క్రీన్ మీద ఆమెను చూసేందుకు ఆడియన్స్ చూపే ఇంట్రెస్ట్ వల్ల ఫ్లాపులు కూడా ఆమె ఇమేజ్ ను ఏమాత్రం దెబ్బతీయలేకపోతున్నాయి. మేకర్స్ కూడా ఆమె నటనను, గ్లామర్ అట్రాక్షన్ ను నమ్మి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన సబ్జెక్ట్స్ ఎంచుకోవడం మృణాల్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇటు సౌత్ సినిమాలతో పాటు అటు నార్త్ లోనూ క్రేజీ ఆఫర్స్ లైన్ లో పెడుతూ ఈ భామ ఫుల్ బిజీగా గడుపుతోంది. అల్లు అర్జున్ రాకా సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తోంది.
This post was last modified on June 19, 2026 5:53 am
Page: 1 2
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…