పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమా మాత్రం మరో అడుగు ముందుకేసేలా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను పాన్ వరల్డ్ స్కేల్ లో భారీగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మన భారతీయ భాషల్లోనే కాకుండా మాండరిన్, జపనీస్, కొరియన్ లాంటి మొత్తం ఎనిమిది భాషల్లో ఒకేసారి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టినే ప్లాన్ చేస్తున్నారు.
అసలు మన టాలీవుడ్ మేకర్స్ సడెన్ గా ఈస్ట్ ఏషియన్ మార్కెట్ మీద ఎందుకు కన్నేశారు అనే డౌట్ రావడం సహజం. దీని వెనుక ఒక పక్కా బిజినెస్ స్ట్రాటజీ ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. కొరియా, జపాన్ దేశాల్లోని ఆడియన్స్ కు డార్క్ కంటెంట్, రా యాక్షన్ సినిమాలు అంటే ఎక్కడలేని పిచ్చి. వాళ్ల రెగ్యులర్ కంటెంట్ చూస్తే ఈ విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది.
కరెక్ట్ గా డైరెక్టర్ సందీప్ వంగా టేకింగ్ కూడా అదే అగ్రెసివ్ స్టైల్ లో ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్ అక్కడ బాగా వర్కవుట్ అవుతుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో ప్రభాస్ ఒక సస్పెండ్ అయిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ను ఒంటరిగా ఎదుర్కొనే ఈ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కచ్చితంగా అక్కడ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొరియన్ మూవీ లవర్స్ కు ఇలాంటి పాయింట్స్ చాలా త్వరగా కనెక్ట్ అవుతాయి. వాళ్లకు కావాల్సిన ఎమోషన్, బ్లడ్ షెడ్ వంగా మార్క్ డైరెక్షన్ లో పుష్కలంగా ఉంటాయి. ఆ నమ్మకంతోనే టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అసలైతే మన సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యాక, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇలా ముందే టార్గెట్ పెట్టుకుని ఎనిమిది భాషల్లో ఒకేసారి గ్లోబల్ రిలీజ్ కు వెళ్లడం ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.
ఇది గనక పర్ఫెక్ట్ గా క్లిక్ అయితే టాలీవుడ్ సినిమా బిజినెస్ లెక్కలు మారిపోతాయి. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే అదనపు కలెక్షన్స్ టాలీవుడ్ బాక్సాఫీస్ నంబర్స్ కు డబుల్ బూస్ట్ ఇస్తాయి. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రొడక్షన్ స్కేల్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. భారీ తారాగణంతో సందీప్ వంగా సిద్ధం చేస్తున్న ఈ డార్క్ యాక్షన్ ట్రీట్ కొరియన్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో ఎక్కుతుందో చూడాలి.
This post was last modified on June 19, 2026 8:27 am
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…