కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్ రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. పెట్టుబడి మీద ఏకంగా 200 రెట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిందీ సినిమా. ముందు వెయ్యి కోట్ల మార్కును అందుకుంది. తర్వాత రెండు వేల కోట్ల మైలురాయిని కూడా దాటేసింది. ఇంకా ఈ చిన్న సినిమా సంచలనాలకు తెరపడలేదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఇండియాలో కూడా అబ్సెషన్ సంచలనాలు మామూలుగా లేవు. నెమ్దమిగా మొదలై దేశవ్యాప్తంగా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అవుతోంది. ఇప్పటికే ఇండియాలో ఈ చిత్రం రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. మన దేశంల అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ హార్రర్ చిత్రాల్లో అబ్సెషన్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఫైనల్ డెస్టినేషన్-బ్లడీనెస్ చిత్రాన్ని అబ్సెషన్ దాటేసింది.
ఇక అబ్సెషన్ ముందు ఉన్నది కంజూరింగ్-ది లాస్ట్ రైట్స్ మాత్రమే. గత ఏడాది విడుదలైన ఆ చిత్రం రూ.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ హాలీవుడ్ హార్రర్ మూవీగా నిలిచింది. అబ్సెషన్ థియేట్రికల్ రన్ ఇంకా ముగియలేదు. మే 15న విడుదలైన ఈ చిత్రం నెల తర్వాత కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తూనే ఉంది. ప్రతి వీకెండ్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు వస్తున్నాయి. కాబట్టి ఫుల్ రన్లో కంజూరింగ్ రికార్డును కూడా ఈ చిత్రం బద్దలు కొట్టొచ్చు.
సినిమా మీద పెట్టిన పెట్టుబడి మీద ఇండియాలోనే ఏడెనిమిది రెట్లు వసూలు చేయడమంటే ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అన్నది అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ హంగులు, స్టార్ పవర్ కంటే కంటెంట్ ఎంత ముఖ్యమో చెప్పడానికి అబ్సెషన్ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇటీవల తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కూడా ఒక ప్రెస్ మీట్లో అబ్సెషన్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది.
This post was last modified on June 16, 2026 10:00 pm
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…