Movie News

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని వాటికి సాంగ్సే ప్రాణంగా నిలుస్తాయి. అలాంటిది పెద్ది పాటల పూర్తి వీడియోలను ఏదో ట్రైన్ తరుముకుంటూ వస్తున్నట్టు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు విడుదల చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చికిరి చికిరి, రైరై రారయ, హేల్లెల్లో హెల్లో మొత్తం యూట్యూబ్ లో దిగుమతి అయిపోయాయి. మస్సా మస్సా కూడా దాదాపు వచ్చినట్టే.

మూడో వారంలోకి అడుగు పెట్టకుండానే ఇంత విజువల్ కంటెంట్ ని బయటికి వదిలితే ఎలా అనేది అసలు ప్రశ్న. అయితే ఓటిటి అగ్రిమెంట్ నాలుగు వారాలకే జరిగి ఉంటుంది కాబట్టి ఆడియో కంపెనీలు సెకండ్ వీక్ నుంచి వీడియో సాంగ్స్ స్ట్రీమింగ్ చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకుంటాయి. కాకపోతే ఒక్కో పాట మధ్య కనీసం రెండు మూడు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకుంటాయి. కానీ పెద్ది విషయంలో అవన్నీ పక్కనపెట్టేసి మూకుమ్మడిగా వదిలేస్తున్నారు.

ఈ సంగతి పక్కనపెడితే నాలుగు వందల కోట్ల క్లబ్బులో ఏ నిమిషమైనా అడుగు పెట్టబోతున్న పెద్దికి ఫైనల్ రన్ దగ్గర్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదలవుతున్న అయిదు కొత్త సినిమాల్లో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయంటే ఆడియన్స్ దృష్టి అటువైపు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మా ఇంటి బంగారం, దీవానా మీద బజ్ బాగానే ఉంది. పెద్ది సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి వచ్చినా వీక్ డేస్ డ్రాప్ గణనీయంగా ఉంది.

పెద్ది ప్రమోషన్లు ముగింపుకి వచ్చినట్టే కనిపిస్తోంది. బుధవారం సక్సెస్ మీట్ అన్నారు కానీ ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. భారీ ఎత్తున అభిమానుల సందోహం మధ్య నిర్వహిస్తారా లేక ఇన్ డోర్ లో కానిస్తారా అనేది వేచి చూడాలి. విలన్ దివ్యెందు శర్మ మొన్నటి నుంచే హైదరాబాద్ లో ఉన్నాడు. థియేటర్లను ఒక రౌండ్ వేసి వచ్చాడు. అన్నట్టు రేపటి నుంచి కొత్త సీన్లు ఉంటాయని దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన నేపథ్యంలో అది నిజంగా జరుగుతుందానేది సస్పెన్స్ గానే ఉంది.

This post was last modified on June 16, 2026 9:45 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago