Movie News

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప దర్శకులుగా దశాబ్దాల పాటు చలామణి అయిన చాలామంది చివర్లో స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోయిన వాళ్లే. తమ చివరి చిత్రాల విషయంలో వారికి చేదు అనుభవం తప్పలేదు. ఒక హై నోట్‌తో కెరీర్‌ను ముగించిన దర్శకులు అరుదుగా కనిపిస్తారు.

దర్శకరత్న దాసరి నారాయణరావునే తీసుకుంటే.. ఆయన చివరగా నందమూరి బాలకృష్ణతో తీసిన ‘పరమ వీర చక్ర’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అంతకుముందు కూడా దాసరికి ఫ్లాపులున్నాయి. కానీ చివరి సినిమా మరీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఇక రాఘవేంద్రరావు విషయానికి వస్తే.. ఆయన ఆఖరి చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’కు మంచి టాకే వచ్చినా.. అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కాకపోతే చివరగా వేంకటేశ్వరస్వామి మీద ఒక భక్తి రస చిత్రం చేశాననే సంతృప్తి మాత్రం ఆయనకుంది.

ఇక మరో లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌‌కు ‘శుభప్రదం’ రూపంలో చివరి చిత్రం చేదు జ్ఞాపకంగానే మారింది. బాపు సైతం ‘సుందరకాండ’ పేరుతో ఒక పేలవమైన చిత్రాన్ని అందించారు. కోదండరామిరెడ్డి (పున్నమినాగు), కోడిరామకృష్ణ (నాగరాహువు) లాంటి గ్రేట్ డైరెక్టర్స్ సైతం చివరి చిత్రాన్ని చిరస్మరణీయం చేసుకోలేకపోయిన వాళ్లే.

కానీ వీళ్లందరితో పోలిస్తే సింగీతం శ్రీనివాసరావు భిన్నంగా నిలబడ్డారు. ప్రయోగాలకు పెట్టింది పేరైన ఈ లెజెండరీ డైరెక్టర్ చివరగా ‘సింగ్ గీతం’ చిత్రంతో మెప్పించారు. గత వీకెండ్లో రిలీజైన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది. హిట్ కావడం కంటే కూడా ఈ సినిమా విశిష్ఠత ఏంటంటే.. ఇది కంటెంపరరీ సినిమా అనిపించుకుంది.

యువ దర్శకులకు కూడా సాధ్యం కాని కొత్తదనాన్ని చూపించారు సింగీతం. ఎప్పుడో 40 ఏళ్ళ కిందటే ఆయన ఇంత వైవిధ్యమైన ఆలోచన చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఈ కథను తెరపై చూసినా అహెడ్ ఆఫ్ టైమ్స్ అనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. 94 ఏళ్ల దర్శకుడు ఇంత వైవిధ్యమైన సినిమా తీయడం అన్నది ఒక చరిత్ర. తెలుగులో ఎందరో దిగ్గజ దర్శకులకు సాధ్యం కాని విధంగా సక్సెస్ ఫుల్, కంటెంపరరీ సినిమా తీయడం ద్వారా తనది వేరే లీగ్ అని చాటారు సింగీతం.

This post was last modified on June 16, 2026 6:45 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago