Political News

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ నిలిస్తే…మధ్యలో అధికార కాంగ్రెస్ నిలిచి ఓ రేంజిలో కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే… రేవంత్ చేస్తున్న ఆరోపణలను ఖండించేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి,కిషన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇక తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఈ బరిలోకి బీఆర్ఎస్ కూడా దిగింది. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు దిగితే.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ దిగారు. వెరసి ఇప్పుడు తెలంగాణలో ఓ రేంజిలో ముక్కోణపు పోరు సాగుతోంది.

అయినా ఈ యుద్ధం ఏ మిషయం మీద అంటే… హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే వ్యవహారంలోనే ఈ పోరు సాగుతోంది. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఆద్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో మెట్రో రైలు ఏమాత్రం పురోగతి లేకుండా సాగుతోందని, అంతేకాకుండా మెట్రో విస్తరణ దిశగా ఎలాంటి పురోగతి లేదన్న కారణంలో రేవంత్ సర్కారు నేరుగా రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెట్రోను తీసుకురావాలంటే…ఎల్ అండ్ టీ పెట్టిన ఖర్చును ఆ సంస్థకు చెల్లించాలి కదా.

ఎల్ అండ్ టీకి పైసలు చెల్లించి ఆ సంస్థకు గుడ్ బై చెప్పే విషయంలోనే ఈ త్రికోణపు యుద్ధం జరుగుతోంది. ఎల్ అండ్ టీకి చెల్లాంచాల్సిన మొత్తం రూ.13,615 కోట్లను రుణంగా ఇచ్చేందుకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ సీ) సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. ఆ రుణం నెలలు గడుస్తున్నా.. రుణం మంజూరు కాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి…కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభ్యంతరంతోనే ఐఆర్ఎఫ్ సీ తన రుణాన్ని నిలిపివేసిందని సంచలన ఆరోపణ గుప్పించారు. తమ పార్టీ ప్రభుత్వం లేని కారణంగానే బీజేపీ సర్కారు తెలంగాణకు దక్కాల్సిన ఈ రుణాన్ని నిలిపివేసిందని కూడా ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. తెలంగాణ పట్లే కాకుండా ఏ రాష్ట్రం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి గానీ, పక్షపాత వైఖరి గానీ చూపదని కిషన్ రెడ్డి అన్నారు. అయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్రం ఇప్పటికే రూ.1,200కోట్ల మేర నిధులను అందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం నిధులు ఇచ్చిన ప్రాజెక్టుకు రుణం దక్కుతుందంటే తామెందుకు అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏదో రాజకీయంగా ఆరోపించాలి కాబట్టి నిందలు వేస్తున్నారే తప్పించి.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాను పాటుపడుతున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ దిశగా సాగుతున్న ఈ యుద్ధంలో తాజాగా బీఆర్ఎస్ కూడా వచ్చి చేరింది. రాష్ట్రానికి మంజూరు అయిన రుణాన్ని సాధించుకోలేని చేతగాని తనాన్ని రేవంత్ రెడ్డి ఇతరులపైకి నెట్టుతున్నారని బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు,శ్రవణ్ ఆరోపించారు. ఏ విషయంలో అయినా తన మీదకు నెపం వచ్చిందంటే చాలు.. దానిని ఇతరుల మీదకు నెట్టడంలో రేవంత్ అగ్రగణ్యుడని వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వారిద్దరూ రేవంత్ ను చేతగాని సీఎంగా అభివర్ణించడం గమనార్హం. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అనుమతులను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా కేంద్రం నుంచి తీసుకుని రాలేని రేవంత్ సీఎం సీటులో కూర్చునే హక్కును కోల్పోయారని వారు ఆరోపించారు. మొత్తంగా ఈ మూడు పార్టీలు ఒకే అంశంపై ఓ రేంజిలో వాదోపవాదాలు చేసుకుంటున్నాయి.

This post was last modified on June 16, 2026 5:46 pm

Share

Recent Posts

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

1 hour ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

3 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

4 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

11 hours ago

సర్దార్ 2 ఈసారి మరింత సీరియస్

కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…

12 hours ago

టాలీవుడ్ గాయాల జాబితాలోకి కొత్త పేరు

ఎన్న‌డూ లేని విధంగా ఈ మ‌ధ్య టాలీవుడ్ స్టార్లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు గాయ‌ప‌డ‌డం ఆందోళ‌నక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

13 hours ago