Movie News

నాగబంధంను వ‌ద్ద‌న్న స్టార్ హీరోలు

స్టార్ హీరో హీరోయిన్లు న‌టించ‌క‌పోయినా.. పేరున్న ద‌ర్శ‌కుడు తీయ‌క‌పోయినా.. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించి అంచ‌నాలు పెంచిన‌ సినిమా.. నాగ‌బంధం. కొన్ని నెల‌ల ముందు రిలీజ్ చేసిన ఈ సినిమా టీజ‌ర్ చూసి అంద‌రూ షాకైపోయారు. నిర్మాత అభిషేక్ నామా ద‌ర్శ‌కుడిగా మారుతూ తీసిన సినిమా ఇది. పెద‌కాపు చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయిన విరాట్ క‌ర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. స్టార్ హీరోలు న‌టించే ఈవెంట్ ఫిలిమ్స్‌లో కూడా లేని స్థాయిలో అద్భుత‌మైన విజువ‌ల్స్‌, ఎఫెక్ట్స్, భారీత‌నం క‌నిపించాయి ఈ సినిమా టీజ‌ర్లో. సినిమా ఇదే స్థాయిలో ఉంటే ఇదొక సెన్సేష‌న్ కావ‌డం ఖాయం.

ఐతే నాగ‌బంధం ప్రోమోలు చూసిన చాలామందికి ఇందులో ఒక స్టార్ హీరో న‌టిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉండేద‌నే అభిప్రాయం క‌లిగింది. ఐతే నాగ‌బంధం టీం అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డ‌మేమీ లేద‌ట‌. చాలామంది స్టార్ హీరోల ద‌గ్గ‌రికి ఈ క‌థ వెళ్లిన‌ట్లు నిర్మాత‌లు కిషోర్ అన్న‌పురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఐతే స్టార్లెవ్వ‌రూ ఈ సినిమాను ఓకే చేయ‌క‌పోవ‌డంతో క‌థ‌ను న‌మ్మి విరాట్ క‌ర్ణ హీరోగా ఈ సినిమా చేసిన‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. విశేషం ఏంటంటే.. స్టార్ హీరో న‌టించ‌క‌పోవ‌డంతో ఈ సినిమాలో మేజ‌ర్ బ‌డ్జెట్ అంతా ప్రొడ‌క్ష‌న్‌కే ఖ‌ర్చు చేశామ‌ని, అలా బ‌డ్జెట్ రూ.100 కోట్లు అయింద‌ని ప్రొడ్యూస‌ర్స్ చెప్ప‌డం విశేషం. ఇంత బ‌డ్జెట్ పెట్టినా తాము సేఫ్ జోన్లోనే ఉన్న‌ట్లు వారు వెల్ల‌డించారు.

నాగ‌బంధంలో టీజ‌ర్, ఇత‌ర ప్రోమోలు చూస్తే భారీగానే ఖ‌ర్చ‌యింద‌ని అర్థ‌మ‌వుతుందికానీ.. ఆ ఖ‌ర్చు మ‌రీ వంద కోట్లా.. ఒక కొత్త హీరో న‌టించిన సినిమా మీద నిర్మాత‌లు ఏ ధైర్యంతో వంద కోట్లు పెట్టారు.. ఆ బ‌డ్జెట్ రిక‌వ‌రీ ఎలా సాధ్యం అనే ప్ర‌శ్న‌లు త‌లెత్త‌క మాన‌వు. ఐతే అమేజాన్ ప్రైమ్ సినిమా చూసి ఫ్యాన్సీ రేటుకు డిజిట‌ల్ రైట్స్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బ‌య్య‌ర్ల‌కు కూడా సినిమా చూపించి మంచి రేట్ల‌కే సినిమాను అమ్మిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయినా స‌రే రూ.100 కోట్ల రిక‌వ‌రీ అంటే అంత తేలికైన విష‌యం కాదు.

This post was last modified on June 14, 2026 11:49 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

3 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

4 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago