Movie News

దర్శకులారా… చిరు మాట విన్నారా?

తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్లతో ఆయన చూసిన వైభవం అసామాన్యమైంది. ఆ తర్వాత కొంచెం తడబడ్డా సరే.. మళ్లీ ఇంద్ర, ఠాగూర్ లాంటి చిత్రాలతో తన ఆధిపత్యాన్ని చాటారు. ఐతే 2000 ముందు వరకు చిరు ఒకవైపు ఫక్తు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథాబలం ఉన్న, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించేవారు.

రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు చూస్తే చిరు ఎంత గొప్ప నటుడో అర్థమవుతుంది. కానీ కెరీర్లో ఒక దశ దాటాక చిరు ఇలాంటి సినిమాలు చేయడం పూర్తిగా ఆపేశారు. ‘డాడీ’ తర్వాత ఇమేజ్‌‌కు భిన్నమైన సినిమాలే చేయలేదు. పూర్తిగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్లకే పరిమితం అయిపోయారు. కానీ చిరులో ఉన్న గొప్ప నటుడిని బయటికి తీసుకొచ్చే సినిమాలు చేస్తే చూడాలని ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. కానీ ఆ ఆశ తీరడం లేదు.

మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి.. హిందీలో అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్లు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి చేసే పాత్రలు చూసినపుడల్లా చిరు అలా ఎందుకు ప్రయత్నించడు అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. తాజాగా తన కొడుకు రామ్ చరణ్ కొత్త చిత్రం ‘పెద్ది’కి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరు ఇలా రొటీన్‌కు భిన్నమైన, కథాబలం ఉన్న సినిమాలు చేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు సైతం.. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు ఎందుకు చేయవు, నీలోని గొప్ప నటుడిని ఎందుకు బయటికి తీసుకురావు అంటూ తనతో అన్న మాటలను చిరు గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్లో చక్‌దే ఇండియా, దంగల్ లాంటి సినిమాలు చూసినపుడు ఇలాంటివి నేను చేయట్లేదే అనే ఫీలింగ్ తనకు కూడా వచ్చిందని.. కానీ అలాంటి కథలు తన దగ్గరికి రావట్లేదని.. దర్శకులు తనతో అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అని ఒకింత నిరాశను వ్యక్తం చేశారు చిరు. అలాంటి కథలు వస్తే తప్పకుండా నటిస్తానంటూ.. తనకు దక్కని అవకావం ‘పెద్ది’ రూపంలో చరణ్‌కు దక్కిందని ఆయనన్నారు.

ఐతే చిరు ఇలాంటి కథలు చేయరేమో అన్న ఆలోచనతో దర్శకులు ఆ దిశగా ఆలోచించట్లేదని ఇప్పటిదాకా అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ దర్శకులు అలాంటి కథలు తీసుకురాకపోవడం వల్లే చేయట్లేదంటూ చిరు బాంబు పేల్చారు. మరిప్పుడు చిరు ఆలోచనేంటో అర్థమైంది కాబట్టి తప్పు తమ మీద లేకుండా దర్శకులు భిన్నమైన కథలతో చిరును సంప్రదించాల్సిన అవసరముంది. అప్పుడు మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on June 14, 2026 2:43 pm

Share

Recent Posts

చిరుతో మేన‌ల్లుడి పోటీ ప‌క్కా అట‌

ఒక‌ప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్. కానీ రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత త‌న కెరీర్…

40 minutes ago

ఎదురుగాలిని తట్టుకుని నిలవడం గ్రేటే

ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…

1 hour ago

నాని vs మహేష్… అర్థరహిత వాదన

ది ప్యార‌డైజ్ సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్, దీనికి జ‌రిగిన అడ్వాన్స్…

1 hour ago

ఎమ్మెల్యేల రెండు పెళ్ళిళ్ళు… బాంబు పేల్చిన సీఎం

ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…

2 hours ago

సింగిల్ సింహం సిపిఐతో వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…

3 hours ago

చిరు ట్రోల్స్ అన్ని చూస్తున్నారా

మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజ‌రైనా త‌న‌దైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తెర మీదే…

3 hours ago