తమిళంలోనే కాదు తెలుగులోనూ ఐకానిక్ మూవీగా నిలిచిపోయిన క్లాసిక్ బాషా. అండర్ డాగ్ ఫార్ములాని హీరోయిజంతో మిక్స్ చేసి ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ బ్లాక్ బస్టర్ కేవలం రజనీకాంత్ అభిమానులకే కాదు సగటు మూవీ లవర్స్ అందరికీ మర్చిపోలేని కల్ట్ గా నిలిచిపోయింది. ఫస్టాఫ్ లో ఆటో డ్రైవర్ గా, రెండో సగంలో బొంబాయి మాఫియా డాన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వరూపం చూసి బాక్సాఫీస్ కనకవర్షం కురిపించింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారంని దర్శకురాలు నందిని రెడ్డి ఏకంగా బాషాతో పోల్చేశారు. ఇందులో సమంత పాత్ర ఆ షేడ్స్ లో ఉంటుందని, హాలీవుడ్ మూవీ కిల్ బిల్ హీరోయిన్ మన కలిసుందాం రాని కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఇది రూపొందించామని అన్నారు. అంటే ఒక సాంప్రదాయ ఇంటికి కోడలిగా వచ్చిన ఓ యువతీ వెనుక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్, యాక్షన్ ఉంటాయన్న మాట. అవేంటనేదే అసలు ట్విస్టు.
సో బాషాతో పోలిక అంటే చిన్న విషయం కాదు. నిజంగా ఆ స్థాయి క్యారెక్టరైజేషన్, కంటెంట్ కనక సమంత మీద వర్కౌట్ అయితే పెద్ద బ్రేక్ దొరికినట్టే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎవరూ ఇలాంటి పాత్రలు చేయలేదు. అందులోనూ ఖుషి తర్వాత సామ్ చాలా గ్యాప్ తీసుకుంది. మా ఇంటి బంగారం కనక కనెక్ట్ అయితే మంచి వసూళ్లు చూడొచ్చు. పైగా ట్రేడ్ వర్గాలు కూడా ఆ నమ్మకంతోనే ఉన్నాయి. పెద్ది అప్పటికే స్లో అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోవాలి.
పోటీ పరంగా మా ఇంటి బంగారంకు మరీ సీరియస్ అడ్డంకులు లేవు కానీ దీవానా, వంద దేవుళ్ళు కాంపిటీషన్ ఇస్తాయా లేదానేది టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఆపై లెనిన్ ఉంది కనక సామ్ మూవీకి మొదటి వారం కీలకం కానుంది. పాజిటివ్ అయితే మాత్రం సెకండ్ వీక్ కూడా మంచి రన్ దక్కుతుంది. గుర్తింపు ఉన్న హీరో లేకుండా కేవలం సమంత పేరు, ఫేస్ మీద బిజినెస్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు భర్త రాజ్ నిడిమోరు చూసుకోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
