సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్ మొదలై రెండేళ్లు కావస్తోంది. కానీ ఎంతకీ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం పూర్తి కావట్లేదు. అలా అని రజినీకాంత్ అందుబాటులో లేరా అంటే అదేమీ లేదు. తన పాత్రకు సంబంధించి మెజారిటీ పోర్షన్స్ ఎప్పుడో పూర్తి చేశారాయన.
ఐతే ఇందులో ఒక స్పెషల్ క్యామియో ఉందని.. దాంతో ముడిపడ్డ సన్నివేశాలే ఎటూ తేలకుండా పోయాయని సమాచారం. ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ, షారుఖ్ ఖాన్.. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏదీ ఫిక్స్ కాలేదు. కేవలం ఈ క్యామియో రోల్ చుట్టూ అయోమయం వల్ల నెలల తరబడి సినిమా ఆలస్యం అవుతోంది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ క్యామియో పాత్ర కోసం టీం వేట ముగిసిందట. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషనే ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.
‘జైలర్-2’లో క్యామియోకు హృతిక్‌ను ఖాయం చేసి, షూటింగ్‌కు వెళ్లిపోనుందట టీం. ఇందుకోసం షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖ మీడియా పోర్టల్స్‌లో ఈ న్యూస్ ఖరారు చేస్తూ వార్తలు కూడా వచ్చేశాయి. హృతిక్ నటించాడంటే ‘జైలర్-2’కు హిందీలో మంచి బజ్ క్రియేట్ కావడం ఖాయం. సౌత్‌లో కూడా అతడికి మంచి క్రేజే ఉంది. కొన్ని నిమిషాల పాత్ర అయినా సరే.. సరిగ్గా ప్రెజెంట్ చేస్తే బాగానే హైలైట్ కావచ్చు.
మరోవైపు ‘జైలర్’లో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సైతం ‘జైలర్-2’లో తళుక్కుమనే అవకాశముంది. ‘జైలర్’ రూ.500 కోట్ల మేర వసూళ్లు రాబట్టగా.. దీని సీక్వెల్ అంచనాలకు తగ్గట్లు ఉంటే.. డబుల్ కలెక్షన్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత రజినీ, కమల్ కలిసి నటించే సినిమాకు కూడా నెల్సనే దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
