Movie News

ఓజి… పెద్ది… విశ్వంభర ఏదీ

గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టి సగర్వంగా విజయ్ కేతనం ఎగరేశారు. తర్వాత సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారితో చిరంజీవి కూడా ట్రిపుల్ సెంచరీ కొట్టేశారు. ఏడాదిన్నర గ్యాప్ కి న్యాయం చేశారు. ఈ రెండింటి వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ అయినా మెగాభిమానులు పెద్దగా ఫీల్ కాలేదు. కారణం రామ్ చరణ్ పెద్ది వస్తుంది కాబట్టి. ఇప్పుడా లాంఛనం కూడా జరిగిపోయింది.

రెండో వారంలోకి అడుగు పెట్టక ముందే పెద్ది మూడు వందల కోట్లకు పైగా లాగేశాడు. ఇంకా థియేటర్ రన్ బలంగానే ఉంది. ఫైనల్ ఫిగర్స్ ఇప్పుడప్పుడే అంచనా వేయలేం కానీ గేమ్ ఛేంజర్ గాయాన్ని మాన్పడంలో పెద్ది చేసిన సహాయం పెద్దదే. టికెట్ రేట్లన్నీ సాధారణ స్థితికి వచ్చాక థియేటర్ రన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మిక్స్డ్ టాక్ తో మొదలైనప్పటికీ క్రమంగా పాజిటివ్ గా మారడం పని చేసింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా.

నెక్స్ట్ ఇప్పుడు అందరి చూపు విశ్వంభర మీదకు వెళ్తోంది. పైన చెప్పిన వాటికంటే మూడు వందల కోట్లు వసూలు చేయాల్సిన ఛాలెంజ్ ముందు ఈ మెగా మూవీ మీద ఉంది. ఎందుకంటే బడ్జెట్ ఆ స్థాయిలో ఖర్చు పెట్టారు కాబట్టి. మెగా 158 మొదలయ్యాక కూడా విశ్వంభర అప్డేట్స్ రాకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024 టీజర్ లో విఎఫ్ఎక్స్ మీద కంప్లయింట్స్ వచ్చాయి కాబట్టి ప్రమోషన్స్, రిలీజ్ ఆపేశారు సంతోషం. రిపేర్లకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టారు.

ఇప్పుడు ఆగస్ట్ లో చిరంజీవి పుట్టినరోజు వస్తే విశ్వంభర మొదటి టీజర్ వచ్చి రెండేళ్లవుతుంది. బయట ఎక్కడా ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. అప్పుడప్పుడు పోస్టర్లో, చిన్న వీడియో బైట్సో, మేకింగ్ వీడియోసో వదిలితే బాగుండేది. అవేవి లేవు. ఓజి అయిపోయింది. పెద్ది సక్సెస్ అయ్యింది. కనీసం ఇప్పటికైనా విశ్వంభర సౌండ్ చేయడం మొదలెట్టాలని ఫ్యాన్స్ కోరిక. కొన్ని నెలల క్రితం ఓటిటి డీల్ అయిపోయిందనే టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత మళ్ళీ సైలెన్స్.

This post was last modified on June 11, 2026 11:11 am

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

1 hour ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

1 hour ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

3 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

6 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

6 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

7 hours ago