Movie News

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్ బుర్రా మధ్య చిన్నపాటి వివాదం రేగిన సంగతి తెలిసిందే. తన కథను ఇష్టం వచ్చినట్టు మార్చేశారని ఆయన, లేదూ పిలిచినా రాకుండా పెద్ద సినిమాలకు వెళ్లిపోయారని ఆవిడ పరస్పరం తమ వెర్షన్లు చెప్పుకున్నారు. తర్వాత అది ఫ్లాప్ కావడం, అందరూ మర్చిపోవడం జరిగిపోయింది. తాజాగా పోలీస్ కంప్లయింట్ అనే మూవీ విషయంలో ఇది మళ్ళీ రిపీట్ అవుతోంది.

ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఈవెంట్ లో దర్శక నిర్మాత మాట్లాడుతూ ఎంత బ్రతిమాలినా వరలక్ష్మి ఏదో ఒకసాకు చెప్పి తమ ప్రమోషన్లకు రాలేదని, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాక మూడు నెలలు సరస్వతి కోసం బ్రేక్ తీసుకుందని, దాని వల్లే తాము ఆలస్యంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. షూటింగ్ టైంలో చిన్న ప్రమాదం జరిగితే పూర్తి సహకారం అందించామని, అయినా సరే పబ్లిసిటీకి రాకుండా ఇలా తిరస్కరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇందులో నిజమెంత ఉందో తేలాలంటే వరలక్ష్మి వైపు నుంచి కూడా వివరణ వచ్చాక క్లారిటీగా అర్థమవుతుంది. అయితే కారణాలు ఏమైనా ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు తమ వంతుగా ప్రచారంలో భాగం కావడం అవసరం. పోలీస్ కంప్లయింట్ ట్రైలర్ చూస్తుంటే క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. నవీన్ చంద్ర, రవి శంకర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య ఓం, సప్తగిరి, జెమినీ సురేష్ లాంటి సీనియర్లు ఉన్నారు. క్రైమ్, హారర్ రెండూ మిక్స్ చేసి ఏదో వెరైటీ పోలీస్ డ్రామా ట్రై చేశారు.

దర్శకుడు అన్నట్టు పెద్ది కోసం రామ్ చరణ్ రోజు కనిపించాడు, సింగీతం శ్రీనివాసరావు గారు 94 వయసులో మీడియా ముందుకొచ్చారు నిజమే. నటీనటులకే కాదు అందరికీ ఈ బాధ్యత ఉంటుంది. ప్రతి దానికి కాకపోయినా కనీసం ఒకటో రెండో ఈవెంట్లలో పాల్గొంటే ఆడియన్స్ లో కొంత అటెన్షన్ వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా స్పందించాల్సి ఉంది. అయినా అసలే బజ్ లేకుండా వస్తున్న పోలీస్ కంప్లయింట్ ని నిలబెట్టాల్సింది పబ్లిక్ టాకే.

This post was last modified on June 10, 2026 6:09 pm

Share

Recent Posts

తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలా?

భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు వున్నాయి. ఇందులో ఏ రాష్ట్రానికి లేని విధంగా తమిళనాడుకు…

21 minutes ago

48 ఏళ్లుగా నీళ్లు కాకుండా కోకాకోలా తాగి బతుకుంటున్నారా?

ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పేరు వినగానే ఆయన పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలే గుర్తుకొస్తాయి. ఎన్నో…

32 minutes ago

స్విమ్మింగ్ పూల్‌లో దిగితే షాక్.. ఇద్దరు మృతి

విహారయాత్రకు వెళ్లినా, ఖరీదైన హోటల్‌లో బస చేసినా అక్కడి సౌకర్యాలు, భద్రతపై అతిథులు నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌లో…

34 minutes ago

నేను ఒక్క సిగ్నల్ ఇస్తే… బిగ్-బి వార్నింగ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం…

58 minutes ago

టార్గెట్ తెలంగాణ: బీజేపీ పెద్ద‌ల వ్యూహం ఏంటి?

బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న వెనుక పెద్ద…

1 hour ago

మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర…

2 hours ago