Movie News

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత ఆలస్యం జరిగినా షూటింగ్ మాత్రం పరుగులు పెట్టిస్తూ ఈ ఏడాదే విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇవాళ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలారు. పెద్ది రూపంలో డెబ్యూ మూవీతో హిట్టు కొట్టిన వృద్ధి సినిమాస్ నిర్మాణంలో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. 90 సెకండ్ల వీడియోలో ఇంపాక్ట్ గట్టిగా కనిపిస్తోంది.

స్టోరీ కాలం ఏంటో చూపించేశారు. 1993 బొంబాయి వేదికగా జరిగే ఊచకోతలో బాలయ్య విశ్వరూపాన్ని శాంపిల్ గా చూపించారు మలినేని. ఓజి తరహాలో పవర్ ఫుల్ గా డిజైన్ చేసిన గెటప్, తూకం రాళ్లతో రౌడీలను ఎదురుకోవడం, బుల్ డోజర్ తో అందరిని ఎత్తి పడేయడం ఇవన్నీ చూస్తుంటే యాక్షన్ కంటెంట్ మీద ఈసారి భారీ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. బాలయ్యని ఇలాంటి లుక్కులో చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. అందుకే ఫ్రెష్ గా అనిపిస్తోంది.

షూటింగ్ ఇంకా జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. బర్త్ డే కాబట్టి బాలయ్యని మాత్రమే చూపించారు. ప్రత్యేకంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. డిఫరెంట్ సౌండ్ తో చేసిన ప్రయోగం ఎలివేషన్ కు బాగా ఉపయోగపడింది. మాఫియా బ్యాక్ డ్రాప్ అనే క్లారిటీ వచ్చేసింది కాబట్టి జానర్ గురించి సస్పెన్స్ వీడిపోయింది. ఇక ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందనేది కాస్త తెలియాలంటే ట్రైలర్ వచ్చే దాకా ఆగాలి.

విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. టైటిల్స్ కూడా రెండు మూడు పరిశీలనలో ఉన్నాయి కానీ ఫైనల్ కాలేదు. ఇన్ సైడ్ టాక్ అయితే దసరా సందర్భంగా అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేయొచ్చనే తరహాలో సంకేతం ఇస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే 2027 సంక్రాంతికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లకపోవచ్చు. ఇవాళ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, భైరవద్వీపం రీ రిలీజులతో సెలబ్రేట్ చేసుకున్న బాలయ్య అభిమానులకు ఎన్బికె 111 క్లోజింగ్ సిక్సర్ కొట్టేసింది

This post was last modified on June 10, 2026 5:59 pm

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

10 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

1 hour ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

2 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

2 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

3 hours ago