ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. సహజత్వానికి దగ్గరగా, ఓవర్ హీరోయిజంకు దూరంగా దర్శకుడు ఆదిత్య ధార్ సృష్టించిన ప్రపంచం రెండు భాగాలు కలిపి మూడున్నర వేల కోట్లకు పైగా వసూలు చేయడం ఎవరూ అంత ఈజీగా దాటలేని చరిత్ర. అది కూడా కేవలం మూడు నెలల గ్యాప్ లో సీక్వెల్ వదిలి బ్లాక్ బస్టర్ అందుకోవడమంటే మాటలు కాదు.
ఇప్పుడీ దురంధర్ ప్రభావం ఇతర సినిమాల మీద పడుతోంది. జూలై మొదటి వారంలో ఆల్ఫా విడుదల కానుంది. అలియా భట్, షర్వారి ప్రధాన పాత్రలు పోషించిన ఈ స్పై డ్రామాలో బాబీ డియోల్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకున్నారు. ఇవాళ టీజర్ వదిలారు. కూతుర్ని చిన్నప్పటి నుంచే గూఢచారిగా మలిచేందుకు శిక్షణ ఇచ్చిన తండ్రి ఒక మిషన్ కోసం ఆమెను సిద్ధం చేస్తాడు. అన్ని విద్యల్లో ఆరితేరిన ఆల్ఫా తన తండ్రి ఇచ్చిన పనిని ఎలా పూర్తి చేసిందనేది స్టోరీ.
విజువల్స్, ఫైట్స్ ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తున్నప్పటికీ దురంధర్ చూసిన కళ్ళతో ఆల్ఫా లాంటి వాటిని అంగీకరించడం కష్టమైపోతోంది. అలియా భట్ ఈ మూవీ కోసం చాలా కష్టపడింది. ఫైట్స్ గట్రా నేర్చుకుని రిస్కులు చేసింది. నిజానికీ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే రావాలి. వాయిదాల మీద వాయిదాలు, రీ షూట్లు కలిపి ఫైనల్ గా ఇక్కడి దాకా వచ్చింది. వార్ 2 డిజాస్టర్ తో షాక్ తిన్న యష్ రాజ్ ఫిలింస్ దీనికి నిర్మాత కావడం అసలు ట్విస్టు.
తెలుగుతో సహా డబ్బింగ్ రూపంలో ఇతర భాషల్లోనూ అల్ఫాని విడుదల చేయబోతున్నారు. ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది థియేటర్లలో అడుగు పెట్టాకే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ క్లైమాక్స్ తర్వాత చూపించిన చిన్న సీన్ ఆల్ఫాలోదే. అది హిట్ అయ్యుంటే యునివర్స్ కాన్సెప్ట్ తో అల్ఫాలో ఆ ఇద్దరు హీరోలని చూపించాలని తొలుత అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఆర్ఆర్ఆర్ తర్వాత కనిపించడం తగ్గించేసిన అలియాకు అల్ఫా ఎలాంటి బ్రేక్ అవుతుందో చూడాలి.
This post was last modified on June 10, 2026 4:02 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…