Movie News

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా క్యాన్సిల్ అని టాక్ రాగా అవేమి నిజం కాదని క్లారిటీ వచ్చింది. ఇక దసరా పండుగ తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేందుకు టీమ్ రెడీ అవుతోందనే టాక్ వస్తోంది. రాకాతో పాటు ఈ సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానికంటే, బన్నీకి ఎదురుగా నిలబడే ఆ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారనే పాయింట్ పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ యాక్షన్ డ్రామాలో ప్రతినాయకుడి పాత్ర అత్యంత కీలకం కాబోతోందని ఇన్ సైడ్ టాక్. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. హీరో పాత్రను ఎంత బలంగా చూపిస్తాడో, నెగిటివ్ రోల్స్ ను కూడా అంతే పవర్ ఫుల్ గా డిజైన్ చేయడం అతని మేకింగ్ స్టైల్.

గతంలో మాస్టర్, విక్రమ్, లియో లాంటి చిత్రాల్లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సంజయ్ దత్ లాంటి స్టార్లను విలన్లుగా పెట్టి మెప్పించాడు. సర్ ప్రైజ్ గా రోలెక్స్ సూర్య వచ్చాడు. కేవలం హీరో ఎలివేషన్స్ కోసం కాకుండా కథను ముందుకు నడిపించే ఒక బలమైన ఇంజిన్ లా ఆ పాత్రలు ఉంటాయి. అందుకే ఈ కొత్త సినిమాలో కూడా విలన్ ఎవరనే దానిపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

కానీ ఇదే సమయంలో లోకేష్ తన గత చిత్రాల ఫలితాలను కూడా ఇక్కడ కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. రజినీకాంత్ తో భారీ అంచనాల మధ్య తీసిన కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున లాంటి బడా స్టార్లను కాస్టింగ్ లో పెట్టారు. ఆ మల్టీస్టారర్ హడావుడి చూసి జనాలు కూడా ముందుగా భారీగానే థియేటర్లకు వెళ్లారు. కానీ స్క్రిప్ట్ లో అసలు దమ్ము లేకపోవడంతో అంత పెద్ద తారాగణం ఉన్నా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో అస్సలు ఆడలేదు. ఆ సినిమా భారీ నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా నిలిచింది.

కేవలం పెద్ద స్టార్లను విలన్లుగా పెట్టేస్తే సినిమా హిట్ అయిపోదు అనే సత్యాన్ని కూలీ బాక్సాఫీస్ రిజల్ట్ చాలా స్పష్టంగా నిరూపించింది. కథలో ఇంటెన్సిటీ లేనప్పుడు ఎంతమంది క్రేజీ యాక్టర్లను తీసుకొచ్చినా కమర్షియల్ గా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాత్రకు తగిన వెయిట్ ఉన్నప్పుడే ఆడియన్స్ ఎమోషనల్ గా థియేటర్లలో కనెక్ట్ అవుతారు. అందుకే ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం లోకేష్ కేవలం స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ల వెనుక పడకుండా, కథకు పక్కాగా సెట్ అయ్యే నటుడిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అతని ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on June 9, 2026 3:52 pm

Share

Recent Posts

మళ్ళీ మొదటికొచ్చిన మెగా కన్ఫ్యూజన్

బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…

6 hours ago

మాట నిలబెట్టుకోలేక పోయాను.. క్షమించండి

రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…

6 hours ago

సుప్రీమ్ హీరో గట్టెక్కే సూచనలు ఎక్కడ

2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…

10 hours ago

రాజమౌళి ముందే ఫిక్సయ్యారు కాబోలు

వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…

12 hours ago

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

15 hours ago

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

17 hours ago