అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది. పెద్దిలో కొన్ని సీన్లను తొలగించి, ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు జోడించి కొత్త వెర్షన్ ని జత చేసే ప్లాన్ లో టీమ్ ఉన్నట్టు తెలిసింది. గౌర్ నాయుడు ఫ్లాష్ బ్యాక్, జాన్వీ సీన్లు, ఢిల్లీలో కొంత ల్యాగ్ అనిపించిన ట్రాక్స్ వగైరాలు తగ్గించేసి వాటి స్థానంలో చరణ్, జగపతిబాబు మధ్య బాండింగ్ సీన్స్ తో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ జోడిస్తారట.
ఒకవేళ ఇలా చేసే పక్షంలో మళ్ళీ సెన్సార్ కు వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే వీలైనంత త్వరగా ఈ పని చేస్తే బెటర్. ఎందుకంటే ఫ్యాన్స్ మళ్ళీ రిపీట్ షోస్ వేయాలన్నా, ఇప్పటిదాకా చూడని ఆడియన్స్ కి ఆసక్తి కలగాలన్నా కాక మీద ఉన్నప్పుడే కానిచ్చేయాలి. అలా కాకుండా వారం పది రోజులు అయ్యాక చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం బుచ్చిబాబు టీమ్ ఇదే పనిలో ఉన్నట్టు తెలిసింది. కన్ఫర్మ్ అనుకున్నాక అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.
నిజంగా జరిగితే మంచి నిర్ణయమే. మిక్స్డ్ టాక్ వచ్చిన వర్గాలు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం అయింది. పోస్ట్ రిలీజ్ తర్వాత జగపతిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ సీన్ల గురించిన వివరాలు బయటికి వచ్చాయి. బుచ్చిబాబు కూడా చరణ్ జాన్వీ పెళ్లి చూపుల గురించి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వస్తే పెద్దికి కొత్త ఫ్లేవర్ రావడం ఖాయం. మూవీ లవర్స్ కూడా మరోసారి థియేటర్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం మూడు వందల కోట్ల గ్రాస్ దాటేసిన పెద్ది కనీసం అయిదు వందల కోట్ల మార్కు అందుకోవాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఓవర్సెస్ లో నెమ్మదిగా ఉండటం, హిందీ వెర్షన్ ఆశించినంత స్థాయిలో స్పందన తెచ్చుకోకపోవడం కలెక్షన్ నెంబర్ మీద ప్రభావం చూపిస్తోంది. ఏపీ తెలంగాణలో మాత్రం మంచి అంకెలు నమోదు చేస్తోంది. కర్ణాటకలోనూ బాగుంది. తమిళనాడు, కేరళ స్పందన అంతగా లేదు. రెండో వీకెండ్ మళ్ళీ పెద్ది కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది.
This post was last modified on June 9, 2026 3:55 pm
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…
ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…
చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…