Political News

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్లాంట్ లో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంంలో దానిని తీసుకెళుతున్న బకెట్ లకు రంద్రం పడి ద్రవ ఉక్కు కిందిపడిపోయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్లాంట్ ఉధ్యోగులు, కార్మకులపై ఆ ద్రవ ఉక్కు పడగా… వారంతా అక్కడికక్కడే చనిపోయారు. అక్కడికి సమీపంలో ఉన్నవారు గాయపడ్డారు. మరి చనిపోయిన వారికి పరిహారం, వారి కుటుంబాలకు భరోసా ఏమిటన్నది ఇప్పటికే తేలిపోయింది.

ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రాత్రికి రాత్రే విశాఖ చేరుకున్నారు. ప్రమాదాన్ని పరిశీలించిన ఆయన మృతుల కుటుంబాలను పమార్శించారు. క్షతగాత్రుల పరిస్థితిపైనా ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం మాట ఏమిటన్న దానిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపైనా ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసిన కుమారస్వామి.. పరిహారం, ఇతరత్రా కార్యక్రమాలను సోమవారం రాత్రే ప్రకటించారు.

తాజాగా మంగళవారం ఉదయం విశాఖ వచ్చిన జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… బాదితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పరిహారం, బాధిత కుటుంబాలకు ఏమేం చేయనున్నాయన్న విషయాన్ని కూడా పవన్ విస్పష్టంగా ప్రకటించారు. కుమారస్వామి ప్రకటించిన వాటికి అదనంగా ఏమేం ఇవ్వనున్నామన్న విషయాన్ని పవన్ చెప్పారు. అటు మంత్రి, ఇటు పవన్ చెప్పిన దాని ప్రకారం బాధితులకు ఏమేం అందనున్నాయన్న దానిపై స్పష్టత వచ్చిందని చెప్పాలి.

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం అందనుంది. అంతేకాకుండా చనిపోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందనుంది. ఆ పిల్లలు ఎంతవరకు చదివితే.. అంతమేర ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందనుంది. ఇక ఆయా కుటుంబాలకు శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలు అందనున్నాయి.

ఇక క్షతగాత్రులకు వారు పూర్తిగా కోలుకునేదాకా ఉచిత వైద్యాన్ని అందనుంది, చికిత్స ఖర్చులు కాకుండా ఒక్కో క్షతగాత్రుడికి రూ.10 లక్షల మేర సాయం అందనుంది. ఇక మృతులకు ఇన్సూరెన్స్ సొమ్ము అందనుంది. ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇన్సూరెస్స్ సొమ్ముకు అదనమని పవన్ విస్పష్టంగా ప్రకటించారు.

విశాఖలోనే వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు వెలువడిన సమయంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ సమయంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని అందేలా చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న చాలా మంది మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ వినిపించకముందే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా ప్రభుత్వం తన బాధ్యతను అందరికంటే ముందు స్పందించి బాధితులకు అండగా నిలిచిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

This post was last modified on June 9, 2026 2:24 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

2 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

3 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

5 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

5 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

5 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

5 hours ago