Movie News

వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరో… ఇప్పుడు 2 కోట్ల కంటే తక్కువేనా?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన హిట్ ఫ్రాంచైజ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ (వెల్‌కమ్ 3) కోసం చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వందల కోట్ల మార్కెట్ ఉన్న ఈ స్టార్.. 2 కోట్ల కంటే తక్కువ అమౌంట్ ని ఫీజుగా తీసుకున్నాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఒక గట్టి టాక్ నడుస్తోంది. అయితే దీని వెనుక ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని సమాచారం. ఫ్రంట్ ఎండ్ ఫీజు బాగా తగ్గించుకున్న అక్షయ్.. బ్యాక్ ఎండ్ లో ఏకంగా 72 శాతం ఐపీఆర్ (IPR) ఆదాయం తీసుకునేలా మాట్లాడుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ ఐపీఆర్ అంటే థియేట్రికల్ రన్ తర్వాత వచ్చే శాటిలైట్, ఓటీటీ, ఆడియో, రీమేక్ హక్కుల ద్వారా వచ్చే డబ్బులు. ఈ హక్కుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 72 శాతం అక్షయ్ కు, మిగతా 28 శాతం నిర్మాతకు దక్కేలా చర్చలు జరిగాయని ముంబై సర్కిల్స్ లో టాక్. సినిమా హిట్ అయితే అక్షయ్ కు వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఫ్లాప్ అయితే ఆ 1.8 కోట్లతో సరిపెట్టుకోవాలి. ఇదొక హై రిస్క్ మోడల్ అయినా, వెల్‌కమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ చూస్తే ఇందులో రిస్క్ చాలా తక్కువే అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన పాత సినిమాలు టీవీల్లో పదే పదే ప్రసారం అవుతూ మంచి రేటింగ్స్ తెచ్చుకుంటున్నాయి. ఆ బ్రాండ్ వాల్యూతోనే రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ కు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రూపంలో దాదాపు 120 కోట్ల బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు నిజమైతే సినిమా థియేటర్లలోకి రాకముందే నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతాడు. ఆ 120 కోట్లలో కూడా అక్షయ్ కి వాటా దక్కుతుందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగానే చర్చ నడుస్తోంది.

ఒకవేళ ఈ టాక్ నిజమైతే నిర్మాతకు ప్రొడక్షన్ బడ్జెట్ పరంగా చాలా టెన్షన్ తప్పుతుంది. హీరోకు ముందే వంద కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన పనిలేకపోవడంతో వడ్డీలకు ఫైనాన్స్ తెచ్చుకునే భారం తగ్గుతుంది. రేపు పొద్దున సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా నిర్మాతకు పెద్దగా నష్టాలు రావు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇద్దరికీ లాభాలే. భవిష్యత్తులో డబ్బుల విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ముందుగానే పక్కాగా మాట్లాడుకున్నారని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

This post was last modified on June 8, 2026 11:18 am

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

9 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

3 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

4 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

9 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

10 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

10 hours ago