Movie News

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి ట్రైలరే రిలీజ్ కాలేదు. ఇలా జరగడం అరుదు. ఐతే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్ రేయింబవళ్లు పని చేస్తున్న నేపథ్యంలో ట్రైలర్ కట్ కోసం సమయం పెట్టే అవకాశం లేక ఆ పనిని మానుకుంది. ఐతే ట్రైలర్ రాకపోయినా సినిమాకు హైప్ ఏమీ తగ్గకుండా చూసుకుంది టీం. నిన్న రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది ప్యారడైజ్’ ప్రి రిలీజ్ ఈవెంట్.. ప్రేక్షకులకు కావాల్సిన కిక్కును, హైప్‌ను ఇచ్చేసింది.

ఈ ఈవెంట్లో ఎన్నో హైలైట్లు ఉన్నాయి. అన్నింట్లోకి హైలైట్ మాత్రం.. విలన్ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు, ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జుయల్ పెర్ఫామెన్స్, తన చర్యలే. నాని వచ్చినపుడు అతడి కాళ్ల మీద పడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రాఘవ్.. తనను స్టేజ్ మీదికి పిలిచినపుడు కెమెరామన్‌తో పాటుగా సాగుతూ.. ‘ఆయా షేర్’ పాటకు వేసిన స్టెప్పులు.. అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడిటోరియాన్ని హోరెత్తించేశాయి.

ఈ కుర్రాడిలో ఇంత జోష్ ఉందా.. ‘ది ప్యారడైజ్’ మూవీతో, ఆ టీంతో, తెలుగు ప్రేక్షకులతో ఇంతగా కనెక్ట్ అయిపోయాడా అనిపించేలా సాగింది తన ఎనర్జీ. యాంకర్ సుమతో కలిసి వేసిన స్టెప్పులైతే వేరే లెవెల్. తన స్పీచ్ కూడా అంత ఉత్సాహంగా సాగింది.

ఇక ఈ ఈవెంట్లో సింగర్ అద్దుల జంగిరెడ్డి ఆయాషేర్, యేషనాగుల కట్ట పాటలు పాడుతూ చేసిన హంగామా కూడా హైలైట్ అయింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఫైనల్ మిక్సింగ్ పనుల్లో ఉండి.. ఈ ఈవెంట్‌కు రాలేకపోయినా ‘ది ప్యారడైజ్’ కోర్ ఎమోషన్‌‌కు తగ్గట్లుగా ‘బ్యాంగర్’ అనిపించేలా అందించిన ‘సమ్మక్క’ పాట ఈవెంట్‌కు మరింత ఆకర్షణ తెచ్చింది.

మరోవైపు ఈ ఈవెంట్‌కు కొసమెరుపు అన్నట్లుగా నాని స్పీచ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. బుధవారం రాత్రి ప్రిమియర్ షోల నుంచే ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల లాక్ పడిపోతుందని.. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవని చెప్పిన నాని.. చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడా ఆకట్టుకుంది.

మనం ఎదిగేటపుడు ప్రేమించేవాళ్లతో పాటు వ్యతిరేకులు కూడా పెరుగుతారని.. ఐతే వాళ్లను ఆపడం కంటే, మనల్ని అభిమానించే వాళ్లను మరింత అలరించేందుకు ప్రయత్నం మాత్రం కొనసాగుతుందంటూ నేచురల్ స్టార్ ఇచ్చిన మెసేజ్ అందరినీ ఆకట్టుకుంది. మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఈవెంట్ సినిమా మీద హైప్‌ను మరింత పెంచేలా సాగి.. అభిమానులకు మంచి జోష్ ఇచ్చిందనే చెప్పాలి.

This post was last modified on September 22, 2026 2:00 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

2 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

2 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

5 hours ago