డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి, ముని సిరీస్ తో వందల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన రాఘవేంద్ర లారెన్స్ త్వరలో కర్ణుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీని లైవ్ యాక్షన్ టెక్నాలజీతో రూపొందిస్తారు. అంటే ప్రతిసారి ఆర్టిస్టు అవసరం ఉండదు. మోషన్ క్యాప్చర్ లాంటి సాంకేతికత సహాయంతో అధిక శాతం విఎఫ్ఎక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
గతంలో రజినీకాంత్ విక్రమసింహ ఇదే తరహాలో రూపొందింది కానీ క్వాలిటీ, కంటెంట్ విషయంలో జనాన్ని మెప్పించలేకపోయింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పటి గ్రాఫిక్స్ లో చాలా మార్పులు వచ్చాయి. బెస్ట్ ఇవ్వడానికి దర్శకులు కష్టపడుతున్నారు. కల్కి 2898 ఏడికి నాగ్ అశ్విన్ ఎంత సమయం తీసుకున్నాడో తెలిసిందే. అయితే కర్ణుడిగా లారెన్స్ ఎంతవరకు ఫిట్ అవుతాడనే దాని మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక శాతం నెగటివే ఉన్నాయి.
మహాభారత గాథలో కర్ణుడు హీరో కాదు. దుర్యోధనుడికి స్నేహితుడిగా, కుంతి పుత్రుడైనా పాండవుల శత్రువుగా యుద్ధం చేశాడనే కోణంలో ఎక్కువ శాతం ప్రతికూలంగా రాస్తూ వచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ వచ్చాక లెక్కలు మారిపోయాయి. కర్ణుడి మహోన్నత వ్యక్తిత్వం సామాన్య ప్రేక్షకులకు చేరిపోయింది. ఆ తర్వాత ఆయన్ని మ్యాచ్ చేయలేమనే భయంతో ఎవరూ కర్ణుడిగా కనిపించే రిస్క్ చేయలేదు. తమిళంలో ఒక్క శివాజీ గణేష్ మాత్రమే మెప్పించారు.
కల్కిలో ప్రెజెంట్ చేసిన విధానానికి ఎక్కువ స్కోప్ లేకపోవడంతో రెండో భాగంలో నాగ్ అశ్విన్ ఎలా చూపిస్తాడనే ఆసక్తి జనాల్లో ఉంది. ఇక కర్ణ విషయానికి వస్తే గతంలో ఇదే బ్యాక్ డ్రాప్ లో సూర్య, విక్రమ్ సినిమా చేయాలని చాలా ట్రై చేశారు. ఫోటో షూట్స్, మేకప్ టెస్ట్ అయ్యాక ఆ ప్రాజెక్టులు క్యాన్సిల్ అయ్యాయి. త్వరలో సల్మాన్ ఖాన్ ఈ క్యారెక్టర్ పోషించబోతున్నాడు. మరి లారెన్స్ తన మీద వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ ని పాజిటివ్ గా ఎలా మార్చుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on September 22, 2026 11:10 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…